మీ ప్రయాణం కష్టమైనది…క్లిష్టమైనది కానీ సాధ్యమైనది.
మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు
గొల్లపూడిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బి.సి. సివిల్ సర్వీసెస్ స్టడీ సర్కిల్ ప్రారంభోత్సవం.
బీసీ సంక్షేమం, ఇ.డబ్ల్యు.ఎస్. సంక్షేమం చేనేత జౌళి శాఖామంత్రివర్యులు శ్రీమతి ఎస్.సవిత తో కలిసి ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న శాసనసభ్యులు కృష్ణప్రసాదు .
‘దేశంలో ఎంతోమంది కోట్లాదిమందితో సివిల్ సర్వీసెస్ విద్యార్థులు పోటీ పడుతున్నారు. సివిల్ సర్వీసెస్లో అత్యుత్తమ ప్రతిభ కనబరచాలనే విద్యార్థుల ప్రయాణం కష్టమైనది…క్లిష్టమైనది కానీ సాధ్యమైనది. జీవితంలో సానుకూల దృక్పధం ఉన్నవారే పైకి వస్తారు. విద్యార్థులు ముందుకు సాగాలనే పట్టుదల, అవకాశాలను అందిపుచ్చుకోవాలనే ఆకాంక్ష కలిగి ఉండాలి. సమయస్పూర్తి, తెలివితేటలు, అకుంఠిన దీక్ష, కఠోరశ్రమతో లక్ష్యాలను సాధించాలి. దార్శనికులు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఏపీకి ముఖ్యమంత్రిగా ఉన్నారు. కూటమి ప్రభుత్వంలో ఎంతోమంది గొప్పవారు పాలకులుగా ఉన్నారు. వారందరి నాయకత్వంలో ఏపీ పురోగమిస్తుంది. నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణంలో మీరందరూ భాగస్వాములు కావాలి. మట్టిలో నుంచే మాణిక్యాలు పుడతారు. మీ కుటుంబాలు వెనుకబాటు తనాన్ని జయించాలంటే మీరంతా ఉన్నతంగా ఎదగాలి. మీ తల్లిదండ్రులు మీపై పెట్టుకున్న నమ్మకాన్ని నెరవేర్చాలి. ‘ అని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు పేర్కొన్నారు.
విజయవాడ రూరల్ మండలం గొల్లపూడి గ్రామంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సివిల్ సర్వీసెస్ స్టడీ సర్కిల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో బీసీ సంక్షేమం, ఇ.డబ్ల్యు.ఎస్ సంక్షేమం చేనేత జౌళి శాఖామంత్రి శ్రీమతి ఎస్.సవిత తో కలిసి మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత వహించిన శాసనసభ్యులు కృష్ణప్రసాదు మాట్లాడుతూ
సివిల్ సర్వీసెస్ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు మీ భవిష్యత్తుపై కన్న కలలను సాకారం చేయాలన్నారు. గతంలో పేద విద్యార్థులు చదువుకోడానికి ఇంత ఇబ్బందులు పడేవారున్నారు. కానీ నేడు ఆ పరిస్థితి లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. నేడు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. ఇప్పటికే తొలి దశను దాటి ఒక విజయాన్ని నమోదు చేశారన్నారు. ఇదే స్ఫూర్తితో ముందుకు సాగి మరో రెండు దశలు కూడా పూర్తి చేసుకుని సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో విజయం సాధించి భారతదేశానికి వెలుగు రేఖలు నింపాలని ఆకాంక్షించారు.
వెల్లటూర్లో బీసీ గురుకుల పాఠశాల ఏర్పాటుకు వినతి.
జి.కొండూరు మండలం వెల్లటూరు గ్రామంలో బీసీ విద్యార్థుల కోసం ఓ గురుకుల పాఠశాల ఏర్పాటు చేయాలని శాసనసభ్యులు కృష్ణప్రసాదు కోరారు. బీసీ హాస్టల్ ఏర్పాటు కోసం తను గత ప్రభుత్వంలో కూడా ఎప్పటినుంచో కృషి చేస్తున్నట్లు వివరించారు. మైలవరం నియోజకవర్గంలో బీసీ వర్గానికి చెందిన బిడ్డలు ఎంతోమంది ఉన్నారన్నారు. వారందరి విద్యాభివృద్ధికి, ఉజ్వల భవిష్యత్తు కోసం గురుకుల పాఠశాల ఏర్పాటు అనివార్యమని, దీని ఏర్పాటుపై మంత్రివర్యులు శ్రీమతి సవితమ్మ ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు. అలానే సివిల్ సర్వీసెస్ విద్యార్థుల కోసం స్ఫూర్తిని నింపే మరింత నైపుణ్యత కలిగిన వక్తలు, మేధావులతో శిక్షణ తరగతులు నిర్వహించాలని మంత్రి కి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో తిరువూరు శాసనసభ్యులు కొలికేపూడి శ్రీనివాస్ , ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌడ వెల్ఫేర్ అండ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి వెంకట గురుమూర్తి , ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.