మానవత్వవాది పవన్ కళ్యాణ్ కి ప్రత్యేక *కృతజ్ఞతలు
జూపాక వేణు మహాజన్
OU నేత,MSP యువ నాయకులు
వరంగల్ : గౌరవనీయులు పెద్దలు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ మరొకసారి పేదల పక్షపాతి అని, పేద ప్రజల పక్షంగా పోరాడిన నాయకులను గౌరవించడం, ఎంతగా ఎదిగినా కూడా వారి యొక్క భావాలు ప్రజల పట్ల మానవత్వ ధోరణితో ఉంటాయో మరొక్క మారు నిరూపించినటువంటి పవన్ కళ్యాణ్ కి ధన్యవాదాలు. ఇలా అనేకమార్లు పేదల పక్షంగా పోరాడిన మందకృష్ణ మాదిగ వారిపై తన యొక్క ఆప్యాయతను అభిమానాన్ని అనేకమార్లు చాటుకున్న సందర్భాలు ఉన్నాయి కానీ ఈ యొక్క ప్రత్యేక పరిస్థితులలో రెండు తెలుగు రాష్ట్రాలే కాకుండా దేశం నలుమూలల ఆయన్ని అభిమానించే ఎంతోమంది అభిమానులు గేమ్ చేంజర్ పవన్ కళ్యాణ్ వైపు చూస్తున్న ఈ క్రమంలో అందరికీ మార్గదర్శమైనటువంటి బాధ్యతాయుతమైనటువంటి నాయకునిగా ప్రవర్తించడం ఆయన యొక్క పరిణతికి అభివృద్ధికి దోహదపడుతుందని జూపాక వేణు తెలియజేశారు.
డిప్యూటీ సీఎం హోదాలో కొణిదల పవన్ కళ్యాణ్ ప్రత్యేక కార్యక్రమంలో దివ్యాంగులకు పెన్షన్ 3000 నుండి 6000 పెరగడానికి మందకృష్ణ మాదిగ గారే కారణం అంటూ.. కృష్ణ మాదిగ కృషిని గుర్తించి సభాముఖంగా హృదయపూర్వక అభినందనలు తెలియజేసిన మానవత్వవాది జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఓయూ విద్యార్థి నేత ఎంఎస్పి యువ నాయకులు జూపాక వేణు మహాజన్ పవన్ కళ్యాణ్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియ చేశారు.