ఎమ్మెల్యే జిఎంఆర్ కు కృతజ్ఞతలు తెలిపిన ఐనోలు, రుద్రారం, రామేశ్వరం

Spread the love

ఎమ్మెల్యే జిఎంఆర్ కు కృతజ్ఞతలు తెలిపిన ఐనోలు, రుద్రారం, రామేశ్వరం బండ గ్రామ ప్రజలు, మాజీ ప్రజాప్రతినిధులు

పటాన్చెరు : తమ గ్రామాల సమగ్ర అభివృద్ధి కోసం నూతన మున్సిపాలిటీలలో విలీనం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సందర్భంగా పటాన్చెరు మండల పరిధిలోని రుద్రారం, ఐనోలు, రామేశ్వరం బండ, గ్రామాల ప్రజలు సాయంత్రం పటాన్చెరువు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ నూతన మున్సిపాలిటీల ద్వారా అభివృద్ధి పనులు వేగవంతం కావడంతో పాటు పరిపాలన వికేంద్రీకరణ సాధ్యమవుతుందని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా మున్సిపాలిటీల అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు మరియు అవుతాయని పేర్కొన్నారు. అభివృద్ధికి ప్రజలందరూ సంపూర్ణ సహకారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రుద్రారం పీఏసీఎస్ చైర్మన్ పాండు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, ఆయా గ్రామాల మాజీ ప్రజా ప్రతినిధులు, సీనియర్ నాయకులు అంతిరెడ్డి, శంకర్ రెడ్డి, మన్నె రాజు, రాజి రెడ్డి, బండి శంకర్, శంకర్ గౌడ్, మల్లేష్, తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top