సూర్యాపేట జిల్లా: అవినీతి అధికారిపై అనిశా వల..
గ్రామ పంచాయతీ కార్యదర్శి లంచం డిమాండ్ చేస్తూ పట్టుబాటు..!
సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్ మండలం నాగులపాటి అన్నారం గ్రామ పంచాయతీ కార్యదర్శి అనంతుల సతీష్ కుమార్‌పై అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు కేసు నమోదు చేశారు.
ఫిర్యాదుదారుడు బొగ్గు ఉత్పత్తి చేసుకోవడం కోసం అటవీ శాఖ అనుమతులు పొందేందుకు అవసరమైన NOC ను గ్రామ పంచాయతీ నుండి తీసుకోవాల్సి ఉండగా, అధికార సహాయం చేయాలంటే రూ.15,000/- లంచం ఇవ్వాలని కార్యదర్శి డిమాండ్ చేశాడు.
ఫిర్యాదుదారుడి అభ్యర్థన మేరకు లంచం మొత్తాన్ని రూ.8,000/- కు తగ్గించి, లావాదేవీ కోసం ఏర్పాట్లు చేస్తున్న సమయంలో అనిశా అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
అవినీతి నిరోధక చట్టం కింద అనంతుల సతీష్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు..
ఒకవేళ ఏ ప్రభుత్వ సేవకుడు అయినా లంచం అడిగినట్లయితే ప్రజలు దయచేసి తెలంగాణ అవినీతినిరోధకశాఖ వారి “టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయండి”. అంతే కాకుండా వివిధ సామజిక మధ్యమాలయిన “వాట్సాప్ ( 9440446106) ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) మరియు వెబ్ సైట్ acb.telangana.gov.in

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
