గుజరాత్ ఉప ఎన్నికల్లో బీజేపీని ఓడించిన కానిస్టేబుల్
గుజరాత్….. గోపాల్ భాయ్ ఇటాలియా గుజరాత్ లోని సాధారణ మధ్య తరగతి రైతు కుటుంబంలో జన్మించారు. కానిస్టేబుల్ గా ఉద్యోగం చేస్తూ ఉన్నతాధికారుల అవినీతిని ప్రశ్నించి ఉద్యోగానికి రాజీనామా చేశారు. తర్వాత రెవెన్యూ శాఖలో చేరారు అక్కడ అదే పరిస్థితి. అవినీతి కి వ్యతిరేకంగా అప్పటి గుజరాత్ హోంమంత్రి పై చెప్పులు విసిరీ సంచలనం సృష్టించారు. తదనంతరం ఆమ్ఆద్మీ పార్టీ లో చేరి రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేశారు. ప్రస్తుతం న్యాయవాదిగా కొనసాగుతూ అందరికీ చట్టం పట్ల అవగాహన కల్పిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ ఓటమి చవిచూశారు. అయితే తాజాగా ఆప్ నుండి గెలిచిన ఎమ్మెల్యే నీ బీజేపీ లో చేర్చుకోగా ఇక్కడ ఎన్నిక అనివార్యమైంది.
బీజేపీ ఈ సీటు ఎలాగైనా గెలవాలని గుజరాత్ ముఖ్యమంత్రి దగ్గర నుండి సర్పంచ్ దాకా ప్రభుత్వం మొత్తం ఏకం అయినా ప్రజలు మాత్రం గోపాల్ ఇటాలియాను 17 వేల పైచీలుకు ఓట్ల మెజారిటీతో ఆశీర్వదించారు.
ప్రజలకు సేవ చేయాలనే దృడ నిశ్చయంతో నాటి పోలీస్ కానిస్టేబుల్ నుండి నేడు ఎమ్మెల్యేగా ఎదిగిన గోపాల్ భాయ్ సంకల్పాన్ని అభినందించాల్సిందే..

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
