కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కోలన్ హన్మంత్ రెడ్డి * ఆధ్వర్యంలో జీడిమెట్ల గ్రామ ప్రజలు లక్ష్మి గంగా ఎనక్లేవ్ సంక్షేమ సంఘ ప్రతినిధులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సలహాదారులు శ్రీ వేం నరేందర్ రెడ్డి ని మర్యాద పూర్వకంగా కలిసి కుత్బుల్లాపూర్ నియోజకవర్గం132 డివిజన్ లోని వెన్నెలగడ్డలో గల సెంట్ ఆంథోని స్కూల్ నుండి వెన్న చెరువు కట్ట, జీడిమెట్ల గ్రామం మీదుగా లక్ష్మీ గంగా ఎనక్లేవ్ వరకు నూతనంగా 60 ఫీట్ల రోడ్డు మంజూరు అయిందని జిహెచ్ఎంసి వారు ఇచ్చిన నోటీసులను పురస్కరించుకొని అట్టి రోడ్డు నిర్మాణం జరిగినచో అనేక ఆస్తి నష్టమై ఎంతోమంది ఇల్లు కూల్చ ద్రాయాల్సి వస్తుంది కాబట్టి ఇది ప్రజలకు చాలా ఇబ్బందులు కలిగించే అంశం కాబట్టి అట్టి నూతనంగా జిహెచ్ఎంసి వాళ్లు ఇచ్చిన నోటీసులకు వ్యతిరేకంగా రోడ్డును రద్దు చేయగలరని మనవి చేయడం జరిగినది. అనంతరం ఈ విషయం పై వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీ ఉపాధ్యక్షులు ధమ్మని శ్రావణ్ కుమార్ ముదిరాజ్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు సిద్దనోళ్ల సంజీవ రెడ్డి, అధ్యక్షులు రవీందర్ రెడ్డి, కౌశిక్, ఆర్గనిసింగ్ సెక్రటరీ రమణ రెడ్డి, రాఘవేందర్ రావు , సంతోష్ కుమార్ మరియు తదితరులు పాల్గొన్నారు.

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
