ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు పీవీ
** ఘనంగా పీవీ నరసింహారావు జయంతి
తిరుపతి: రాజనీతిజ్ఞుడు, ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు స్వర్గీయ ప్రధాని పీవీ నరసింహారావు అని బ్రాహ్మణ కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ పూర్వపు ఉపాధ్యక్షురాలు డా. స్వరాజ్య లక్ష్మీ, గవర్నింగ్ బాడి సభ్యురాలు భాగవతుల జయలక్ష్మి కొనియాడారు. పీవీ నరసింహారావు 104వ జయంతిని తిరుపతిలో ఘనంగా నిర్వహించారు. ముందుగా పీవీ చిత్ర పటానికి బ్రాహ్మణ సమాజం సభ్యులంతా పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడు గతంలో సీఎం గా ఉన్నప్పుడే బ్రాహ్మణుల ఆర్థిక అవసరాలకు అనుగుణంగా క్రెడిట్ సొసైటీ స్థాపించి వేలాదిమంది బ్రాహ్మణులకు ఆర్థిక అవసరాలను తీరుస్తున్నారని తెలిపారు. సౌకర్యాలకు అనుగుణంగా తక్కువ వడ్డీ రేట్లతో రుణాలు అందిస్తూ సేవలు చేస్తున్న ప్రభుత్వానికి ధన్యవాదాలు అని పేర్కొన్నారు. జిల్లాలోని బ్రాహ్మణ సంఘాల సభ్యులు సొసైటీలో సభ్యులుగా చేరాలని డా.స్వరాజ్య లక్ష్మీ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ సొసైటీ సీనియర్ అసిస్టెంట్ పిఆర్ఎల్ కుమార్, క్యాషియర్ డి.హారిక, ఆఫీస్ స్టాఫ్ డి.లీలావతి, గుండాల గోపీనాథ్ రెడ్డి, తొండమ నాటి సుబ్రమణ్య రెడ్డి, మురళీధర్ శర్మ, డా.వసంత కుమార్, డా.అరుణ కుమారి తదితరులు పాల్గొన్నారు.

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
