పెండింగ్ లో ఉన్న అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయండి.
కమిషనర్ ఎన్.మౌర్య
నగరంలో పెండింగ్ లో అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య అధికారులను ఆదేశించారు. ఉదయం స్మార్ట్ సిటీ లో భాగంగా వినాయక సాగర్ లో జరుగుతున్న అభివృద్ధి పనులను, నగరంలో పెండింగ్ లో ఉన్న పనులను స్మార్ట్ సిటీ, ఇంజినీరింగ్ అధికారులతో కలసి కమిషనర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వినాయక సాగర్లో పెండింగ్ లో ఉన్న అన్ని పనులు త్వరగా పూర్తి చేయించేలా అధికారులు చొరవ తీసుకోవాలని అన్నారు. ముఖ్యంగా స్విమ్మింగ్ పూల్, గ్లో గార్డెన్ తదితరాలను పూర్తి చేస్తే ప్రజలకు అందుబాటులోకి తీసుకు రావచ్చును అన్నారు. కొర్లగుంట వద్ద జరుగుతున్న డ్రైనేజీ కాలువ నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేసి వాహన చోదకులకు ఇబ్బంది లేకుండా చేయాలని అధికారులను ఆదేశించారు. లక్ష్మీపురం కూడలి, మామిడికాయల మండి వద్ద కూడళ్లలో ట్రాఫిక్ జామ్ అవుతోందనే పిర్యాదులు ఎక్కువ వస్తున్నాయని, ఇందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. అభివృద్ధి పనులు పూర్తి చేయడంలో అధికారులు శ్రద్ధ చూపాలని అన్నారు. కమిషనర్ వెంట డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణ, కార్పొరేటర్ ఆంజనేయులు, సూపరింటెండెంట్ ఇంజినీర్ శ్యాంసుందర్, మునిసిపల్ ఇంజినీర్ గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, స్మార్ట్ సిటీ ఈ.ఈ.రవి, ఏసిపి బాలాజి , డి.ఈ.లు రమణ, వెంకట ప్రసాద్,శానిటరీ సూపర్ వైజర్ సుమతి తదితరులు ఉన్నారు.

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
