పేటలో వీధి కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు
పట్టణంలో కుక్కలు పడుతున్న సిబ్బంది
చిలకలూరిపేట పట్టణంలో వీధి కుక్కల బెడదను తగ్గించడానికి పురపాలక సంఘం చర్యలు చేపట్టింది.
ప్రభుత్వ ఆదేశాల మేరకు, వీధి కుక్కలను పట్టి వాటికి కుటుంబ నియంత్రణ (సర్జరీ) చేయించి, తిరిగి అవి పట్టుబడిన ప్రాంతంలోనే వదిలిపెట్టనున్నట్లు మున్సిపల్ కమిషనర్ పి. శ్రీహరిబాబు తెలిపారు.
ఈ కార్యక్రమం ద్వారా వీధి కుక్కల సంఖ్యను నియంత్రించవచ్చని, తద్వారా పట్టణ ప్రజలకు వాటి వల్ల కలిగే అసౌకర్యాన్ని తగ్గించవచ్చని ఆయన పేర్కొన్నారు.
ఈ చర్య పశు సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని, శాస్త్రీయ పద్ధతిలో చేపట్టబడుతుందని అధికారులు తెలిపారు.

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
