మంత్రి కార్యాలయం – డా. జి. వివేక్ వెంకటస్వామి *
తెలంగాణ రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన మరియు గనుల శాఖ
పాశమైలారం పేలుడు ఘటన స్థలాన్ని పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి , మంత్రి డా. వివేక్ వెంకటస్వామి
పాశమైలారం ప్రాంతంలోని *సిగాచీ కెమికల్ ఫ్యాక్టరీలో జరిగిన భారీ పేలుడు ఘటన నేపథ్యంలో *తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా సంఘటన స్థలాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. ఆయన వెంట కార్మిక మరియు గనుల శాఖ మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి , పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు , రైతు సంక్షేమ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ,డా. వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ:
“ఈ సంఘటన ఎంతో బాధాకరం. కార్మికుల ప్రాణ భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. బాధితులకు ప్రభుత్వ సహాయం అందేలా అన్ని చర్యలు తీసుకుంటాం. భవిష్యత్‌లో ఇటువంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటాం” అని పేర్కొన్నారు.
మంత్రి అధికారులు మరియు పరిశ్రమ యాజమాన్యంతో సమావేశమై పూర్తి వివరాలు తెలుసుకున్నారు. బాధితులకు అండగా నిలవాలని మంత్రివర్యులు స్పష్టంగా హామీ ఇచ్చారు.
– మంత్రి కార్యాలయం
డా. జి. వివేక్ వెంకటస్వామి
మంత్రి – కార్మిక, ఉపాధి కల్పన మరియు గనుల శాఖ
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
