తిరుమలలో ఆ పని చేస్తే.. జైలే!
తిరుమలలో రీల్స్ చేయడంపై టీటీడీ సంచలన నిర్ణయం తీసుకుంది. శ్రీవారి ఆలయం ముందు, మాడ వీధుల్లో భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ప్రవర్తించినా, రీల్స్ చేసినా సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేసింది. క్షేత్ర పవిత్రతకు భంగం కలిగించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. తిరుమలలో ఆధ్యాత్మిక వాతావరణం, పవిత్రతను కాపాడడంలో భక్తులంతా సహకరించాలని విజ్ఞప్తి చేసింది.

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
