సోషల్ మీడియా కార్యకర్తలు సమర్థవంతంగా పని చేయాలని పార్టీ వాణిని ప్రజల్లో బలంగా వినిపించాలని టిపిసిసి ఉపాధ్యక్షుడు కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి బండి రమేష్ పేర్కొన్నారు. ఆయన నియోజకవర్గానికి చెందిన సోషల్ మీడియా కార్యకర్తలతో కూకట్పల్లి నియోజకవర్గ శ్రీహేమ దుర్గా భవన్లో గల కూకట్పల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కార్యాలయం సమావేశం అయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ చేపట్టిన ప్రతి కార్యక్రమం సోషల్ మీడియా ద్వారానే ఎక్కువగా ప్రజలకు చేరుతుందని అలాంటి మీడియాను మీరు ఒక ఆయుధంలా ఉపయోగించి పార్టీ వాయిస్ ను ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరవేయాలన్నారు. పార్టీ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై అయన కమిటీ సభ్యులు నుండి సలహాలు సూచనలు తీసుకున్నారు.త్వరలోనే నియోజకవర్గానికి సంబంధించి కొత్త కమిటీని నియమిస్తామన్నారు.

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
