రైతు వేదిక నందు ఆకాంక్షిత జిల్లా కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే జారే
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
అశ్వారావుపేట మండల కేంద్రంలో గల రైతు వేదిక నందు ఐదు రోజుల పాటు జరగనున్న ఆకాంక్ష మేళ జిల్లాస్థాయి కార్యక్రమంలో భాగంగా మత్స్యశాఖ ఆధ్వర్యంలో Fish Filletting (చేప నుండి ముల్లు వేరు చేయుట)
Fish Manure (చేప ఎరువులు తయారీ)
Fish Stock (చేప రసం తయారీ)
Circulated Aquaculture System (సర్క్యూలేటేడ్ అక్వాకల్చర్ సిస్టమ్)
కార్యక్రమాలు గురించి ప్రదర్శన జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ కార్యక్రమాన్ని ఉద్దేశించి చేపల పెంపకం పై ఆసక్తి ఉన్నవారికి ప్రభుత్వం అందించే రాయితీలు ప్రభుత్వ ప్రోత్సాహాకాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షులు తుమ్మా రాంబాబు, జూపల్లి రమేష్, సుంకవల్లి వీరభద్ర రావు, మత్స్యశాఖ అధికారులు మిడియం మంగరాజు, యం. నాగపావని కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు మత్స్య రైతులు తదితరులు పాల్గొన్నారు.

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
