రహదారి పునరుద్దరణకు నిధులు మంజూరు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం
ఖమ్మం టు దేవరపల్లి హైవేలో అశ్వారావుపేట సమీపంలో రోడ్డు డ్యామేజ్ అయినందున, దాని పునరుద్ధరణ కు ఎమ్మెల్యే జారే ఆదినారాయణ నిధులు రాబట్టారు. ఈ క్రమంలో వి కే డి వి ఎస్ కాలేజీ నుంచి, రింగ్ రోడ్డు వరకు బీటీ రోడ్డు పునరుద్దరణతో, దాని రెండు వైపులా 8.75 మీటర్లు రెండు వెడల్పు విస్తరించనున్నారు. రూ.10 కోట్లతో బీటీ రోడ్డు, సెంట్రల్ లైటింగ్, డ్రైనేజ్,డివైడర్ లు ఏర్పాటు చేయనున్న పనులను కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు స్థానికులు తదితరులు పాల్గొన్నారు.

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
