బంగారు కుటుంబాల ఎంపిక త్వరగా పూర్తి
** కమిషనర్ ఎన్.మౌర్య
తిరుపతి: తిరుపతి నగరంలో బంగారు కుటుంబాలు, మార్గదర్శకుల ఎంపిక త్వరగా పూర్తి చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ నారపురెడ్డి మౌర్య అధికారులను ఆదేశించారు. పి-4 సర్వేలో బంగారు కుటుంబాలు, మార్గదర్శకుల ఎంపిక పురోగతిపై శనివారం నగరపాలక సంస్థ కార్యాలయంలో అధికారులు, సెక్టోరల్ ఆఫీసర్స్ తో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో పి-4 సర్వేలో బంగారు కుటుంబాలు, మార్గదర్శకుల ఎంపిక పారదర్శకంగా నిర్వహించాలని కోరారు. అధికారులు అందరూ బంగారు కుటుంబాలను స్వయంగా పరిశీలించి వారి స్థితి గతులను పక్కాగా నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. ఆయా సచివాలయ పరిధిలో కూడా సెక్రెటరీలు పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్ అయ్యి పి-4 సర్వే పూర్తి చేయాలన్నారు. బంగారు కుటుంబాల ఎంపికలో పారదర్శకంగా వ్యవహరించాలని, ఏవైనా పొరపాట్లు జరిగితే సంబంధిత అధికారులపై కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సమావేశంలో హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, రెవెన్యూ అధికారులు సేతు మాధవ్, రవి, మేనేజర్ హాసీమ్, తదితరులు పాల్గొన్నారు.

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
