హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని ఆదిత్య నగర్ కాలనీ లో భారీ వర్షాలకు డ్రైనేజ్ నీరు పొంగి నిల్వ ఉండటం వలన కాలనీ వాసుల ఇబ్బందిపడుతున్నారని సమాచారం మేరకు, HMWSSB సిబ్బందితో కలసి పరిశీలించి, పనులను వెంటనే మొదలుపెట్టి సమస్య పరిష్కరించాలని చెప్పేన కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు . ఈ సందర్భంగా నార్నె శ్రీనివాస రావు మాట్లాడుతూ, భారీ వర్షాలకు డ్రైనేజ్ నీరు పొంగి నిల్వ ఉండటం వలన కాలనీ వాసుల ఇబ్బందిపడుతున్నారని సమాచారం మేరకు, HMWSSB సిబ్బందితో కలసి, కాలనీ వాసుల విజ్ఞప్తి మేరకు అధికారులను తీసుకుని వెంటనే సమస్యను పరిష్కరించాలని చెప్పడం జరిగింది అని, అలానే ప్రజా సమస్యలే పరిష్కార ధ్యేయంగా ముందుకు వెళ్తున్నామని, సంతులిత, సమగ్ర అభివృద్దే లక్ష్యంగా పనిచేస్తున్నామని కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు పేర్కొన్నారు. అదేవిధంగా కాలనీ వాసులు అందరూ కలిసి కాలనీ అభివృద్ధి లో భాగస్వాములు కావాలని, కాలనీ వాసులందరి సమిష్టి కృషి తో ఆదర్శవంతమైన కాలనీ గా తీర్చిదిద్దుతామని కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు పేర్కొన్నారు. ఏ చిన్న సమస్య ఐన తన దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తానని, ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటానని, అదేవిధంగా డివిజన్ లో పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా కృషి చేస్తామని ఈ సందర్బంగా కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో HMWSSB మేనేజర్ ప్రియాంక, డ్రైనేజ్ సూపర్వైజర్ నరేంద్ర, డివిజన్ నాయకులు మరియు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
