క్రమశిక్షణ గెలుపోటములను సమానంగా స్వీకరించే తత్వం క్రీడలలో దాగి ఉంది : ఎమ్మెల్యే జారే

Spread the love

క్రమశిక్షణ గెలుపోటములను సమానంగా స్వీకరించే తత్వం క్రీడలలో దాగి ఉంది : ఎమ్మెల్యే జారే

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
దమ్మపేట మండలం పెద్దగొల్లగూడెం క్రీడా మైదానంలో దమ్మపేట మండల ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉమ్మడి ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల స్థాయి ఫోటోగ్రాఫర్ల క్రికెట్ టోర్నమెంట్‌ను నిర్వాహకుల ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ క్రీడలు యువతలో క్రమశిక్షణ గెలుపు ఓటములను సమానంగా స్వీకరించే సహనాన్ని పెంపొందిస్తాయన్నారు. ఫోటోగ్రాఫర్లతో పాటు ప్రతి ఒక్కరు క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఆరోగ్యంగా ఉండటానికి క్రీడలు చాలా అవసరం అన్నారు.
అలాగే ఫోటోగ్రాఫర్లు ఒక వృత్తి పరంగానే కాక సమాజానికి అందించే సేవలు ఎంతో విలువైనవని వారి ఐక్యతతో ఇలాంటి క్రీడా పోటీలు నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు, ఫోటోగ్రాఫర్లు, స్థానిక నాయకులు, క్రీడాభిమానులు, తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top