చిత్తూరు పార్లమెంటరీ టీడీపీ కమిటీ సమావేశం
** హాజరైన “తుడ” చైర్మన్ డాలర్స్
చిత్తూరు: చిత్తూరులోని హోటల్ భాస్కర (ఎన్.పి.ఎస్)లో నిర్వహించిన చిత్తూరు జిల్లా టీడీపీ పార్లమెంటరీ కమిటీ సమావేశానికి తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ చైర్మన్, టీటీడీ బోర్డు సభ్యులు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి డాలర్స్ దివాకర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరైన రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిని, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర బాబుని, లిడ్ క్యాప్ చైర్మన్ మాణిక్యాలరావుని తుడా చైర్మన్ ఘనంగా సత్కరించారు. తిరుపతి, చిత్తూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ పటిష్టతకు ఎంపీలు ఎమ్మెల్యేలతో పాటు బూత్ స్థాయి నాయకులను కలుపుకొని కార్యకర్తలకు అధిక ప్రాధాన్యతనిస్తూ శక్తివంచన లేకుండా కృషి చేస్తామని ఈ సందర్భంగా తుడా చైర్మన్ తెలియజేశారు.

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
