పువ్వుల కోసం చెరువులో దిగిన వ్యక్తి గల్లంతు : మృతదేహం లభ్యం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
దమ్మపేట మండలం మందలపల్లి గ్రామ శివారులో గల చింతలచెరువులో ఓ యువకుడు గల్లంతఅయ్యాడు. గణేష్ నవరాత్రుల కోసం కావలసిన పువ్వులను సేకరించడానికి హైదరాబాద్ నుంచి వచ్చిన ముగ్గురు వ్యక్తులు చెరువులో దిగారు. ఈ క్రమంలో చెరువులోతును అంచనా వేయకపోవడంతో దిగిన ముగ్గురు వ్యక్తుల్లో ఒక వ్యక్తి మునిగిపోయి గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ డిపార్ట్మెంట్ గాలింపు చర్యలు చేపట్టినారు. కొంత సమయం తర్వాత అతడి మృతదేహాన్ని పోలీసులు వెలికితీశారు. చింతలపూడి మండలానికి చెందిన పి, ప్రవీణ్, వినాయక చవితి సందర్భంగా తామర పువ్వులు కోసేందుకు చెరువులోకి దిగాడు. ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందాడు.

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
