తెలంగాణ భాషా సాంస్కృతిక మండలి ఆధ్వర్యంలో సురవరం ప్రతాపరెడ్డి జీవిత చరిత్ర పుస్తక ఆవిష్కరణ చేసిన .
డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి
రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు
- తెలంగాణ భాష సాంస్కృతిక మండలి ఆధ్వర్యంలో వనపర్తి పట్టణంలో దాచ లక్ష్మయ్య ఫంక్షన్ హాల్ లో తెలంగాణ గొప్పతనాన్ని తన రచనలతో చాటి చెప్పి, గోల్కొండ పత్రిక సంపాదకుడిగా, కవిగా ,రచయితగా వనపర్తి నియోజకవర్గ శాసనసభ్యునిగా సేవలందించిన సురవరం ప్రతాపరెడ్డి వర్ధంతి సందర్భంగా శ్రీ సురవరం ప్రతాపరెడ్డి గారి జీవిత చరిత్ర పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి గారు ముఖ్యఅతిథిగా పాల్గొని, పుస్తకాన్ని ఆవిష్కరించారు. పుస్తకాన్ని పాలమూరు ప్రముఖ వైద్యుడు, ప్రజా సేవకుడు డాక్టర్ జిల్లెల మాధవ రెడ్డి కి అంకితం చేశారు
- సురవరం ప్రతాపరెడ్డి , జిల్లెల మాధవరెడ్డి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
- పుస్తక రచయిత ఆచార్య గంటా జలంధర్ రెడ్డి ని చిన్నారెడ్డి శాల్వా, షీల్డ్ తో సన్మానించారు.
- జిల్లెల మాధవరెడ్డి కూతురు జిల్లెల శిల్పని శాలువా, షీల్డ్ తో సన్మానించారు.
చిన్నారెడ్డి మాట్లాడుతూ
పత్రిక సంపదకునిగా, పరిశోధకుడుగా, పండితుడుగా, రచయితగా ప్రేరేకుడుగా, క్రియాశీల ఉద్యమకారుడిగా, బహుభాష పండితునిగా సురవరం ప్రతాపరెడ్డి ప్రతిభ అనన్య మైనది అని అన్నారు.
ఆంధ్ర కవి తెలంగాణ ప్రాంతంలో కవులు లేరని విమర్శిస్తే వారికి ధీటుగా సమాధానం ఇస్తూ 354 మంది కవులతో కూడిన గోల్కొండ కవుల సంచిక గ్రంథాన్ని రాసి ఆంధ్ర కవికి సమాధానం ఇచ్చిన గొప్ప కవి సురవరం ప్రతాపరెడ్డి ని కొనియాడారు.
నిజాం రాజుకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలను చైతన్య పరుస్తూ అనేక రచనలు,పుస్తకాలు రచించారని అన్నారు.
1952 లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో వనపర్తి నియోజకవర్గ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సురవరం ప్రతాపరెడ్డి నిలబడి సమీప ప్రత్యర్థి రామచంద్రారెడ్డి పై గెలిచి వనపర్తి నియోజకవర్గ మొదటి ఎమ్మెల్యేగా విజయం సాధించారని అన్నారు.
మహబూబ్ నగర్ జిల్లా కు చెందిన బూర్గుల రామకృష్ణ రావు అప్పుడు ముఖ్యమంత్రిగా కొనసాగారని తెలిపారు.
1955 లో సురవరం ప్రతాపరెడ్డి రచించిన ఆంధ్రులసాంఘిక చరిత్ర రచనకు కేంద్ర సాహితీ అకాడమీ అవార్డు లభించింది అని అన్నారు.
తెలుగు జాతికి, తెలుగు భాషకు సురవరం ప్రతాప్ రెడ్డి చేసిన సేవలు గాను ప్రభుత్వం హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ పై సురవరం ప్రతాపరెడ్డి విగ్రహం పెట్టి గౌరవించిందని అన్నారు.
సురావరం ప్రతాపరెడ్డి ని ఆదర్శంగా తీసుకునే రాజకీయ జీవితంలో ఎలాంటి అవినీతికి తావు ఇవ్వకుండా ,స్వచ్ఛమైన రాజకీయాలు చేస్తున్నానని అన్నారు.
వనపర్తి నియోజకవర్గంలో పేదలకు ఉచిత వైద్యం చేసిన మా అన్న మాధవరెడ్డి కి సురవరం ప్రతాపరెడ్డి జీవిత పుస్తకాన్ని అంకితం చేస్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమం లో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నందిమల్ల యాదయ్య, వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ యాదవ్, విద్యావంతులు, వివిధ మండలాలకాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కాంగ్రెస్ నాయకులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
