అదుపుతప్పి పామాయిల్ లోడ్ తో వెళుతున్న ట్యాంకర్ బోల్తా

TEJA NEWS

అదుపుతప్పి పామాయిల్ లోడ్ తో వెళుతున్న ట్యాంకర్ బోల్తా

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
దమ్మపేట మండలం కొమ్ముగూడెం శివారులోని క్రూడ్ పామాయిల్ లోడ్ తో వెళుతున్న ట్యాంకర్ రాత్రివేళ సమయంలో బోల్తా పడింది. స్థానికుల కదనం ప్రకారం దమ్మపేట మండలంలోని అప్పారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీ నుండి తమిళనాడుకు 25 టన్నుల క్రూడ్ పామాయిల్, ఆయిల లోడ్ తో ట్యాంకర్ బయలుదేరింది. ఈ క్రమంలో కొమ్ముగూడెం శివారులో ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్, క్లీనర్ కు అదృష్టవశాత్తు ఎలాంటి గాయాలు కాని ప్రాణ నష్టం కాని జరగపోవడంతో బోల్తా పడిన వాహనాన్ని చూసిన స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

You cannot copy content of this page

Scroll to Top