మానవహారం కార్యక్రమాన్ని జయప్రదం చెయ్యండి
*గంజాయి మహమ్మారిని తరిమి కొట్టండి… భావి భారతాన్ని బలంగా నిర్మించండి…
గంజాయి వ్యతిరేక కమిటీ నాయకుల పిలుపు
అఖిల పక్షాలు, అన్ని బస్తీల కమిటీలు గంజాయి వ్యతిరేక సమావేశం తీసుకున్న నిర్ణయాలను జగత్గిరిగుట్ట పోలీస్ ఇన్స్పెక్టర్ బి వెంకటేష్ కు గంజాయి వ్యతిరేక కమిటీ సభ్యులు కలిసి వివరించారు.
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ… పోలీస్ అధికారులు, స్థానిక బస్తీ కమిటీల ఆధ్వర్యంలో… అన్ని బస్తీలలో గంజాయి వ్యతిరేక సమావేశాలు నిర్వహించాలని… అదే విధంగా ఈ నెల బాలల దినోత్సవం సందర్బంగా అన్ని బస్తీల కమిటీల నాయకులు, అన్ని రాజకీయ పార్టీల నాయకులు, ప్రజలు, విద్యార్థులతో మానవహారాన్ని నిర్వహిచాలని నిర్ణయించడం జరిగిందన్నారు.ఆ కార్యక్రమానికి హాజరై అందరికి ఐక్య సందేశం ఇవ్వాలని కోరడమైనది.
సీఐ కూడా మా సిబ్బంది పాల్గొంటుందని అదే విదంగా సమావేశాలు నిర్వహిస్తామని అన్నారు.
ఈ సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి ఉమా మహేష్, సహాయ కార్యదర్శులు హరినాథ్, రాములు, కాంగ్రెస్ నాయకులు సాయి పంతులు, బీఆర్ఎస్ నాయకుడు సాజిద్,జనసేన నాయకులు సతీష్,లేనిన్ నగర్ నాయకులు సదానందం, సాయిలు, రాజు, రవీందర్, శ్రీనివాస్ నగర్ ఖాయుమ్, మైసమ్మ నగర్ బ్రహ్మానంద చారీ, కృష్ణ,వెంకటేష్, సోమయ్య నగర్ కుమార స్వామి, శ్రీనివాస్, ప్రజానాట్యమండాలి బాబు, ట్రాన్స్పోర్ట్ యూనియన్ అధ్యక్షులు శ్రీనివాస్ చారీ, బీరప్ప నగర్ చారీ, దేవమ్మ బస్తీ వంశీ తదితరులు పాల్గొన్నారు.

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
