తెలంగాణలో రాజకీయ ప్రత్యామ్నాయ శక్తిగా తెలంగాణ జన సమితి పార్ట,…… టి జె ఎస్ సి కమిటీ
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పార్టీ బలోపేతానికి కృషి
……
వనపర్తి :
ప్రజాస్వామ్య పరిరక్షణకై ప్రభుత్వాల పారదర్శక పాలన ప్రజలకు అందించే విధంగా నీతి నిజాయితీతో పని చేసే ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా తెలంగాణ జన సమితి పార్టీ నిలుస్తోందని ఆ పార్టీ నిర్మాణ కమిటీ సభ్యులు పేర్కొన్నారు జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ రాజకీయాల్లో మార్పు కోసమే తెలంగాణ జన సమితి పార్టీ ఏర్పడిందని ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి సమాన అవకాశాలు లభించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు ఓట్లు నోట్లు కాకుండా ప్రజల జీవితాలు ప్రజల సమస్యలు తీర్చేందుకు రాజకీయాలు జరగాలని అన్నారు ఈ సమావేశంలో జిల్లా మండల స్థాయి పార్టీ నిర్మాణం భవిష్యత్తు కార్యాచరణ పార్టీ విస్తరణ ప్రజా పోరాటాల కార్యక్రమాలపై చర్చించి పలు తీర్మానాలు తీసుకోవడం జరిగింది గ్రామపంచాయతీ మున్సిపాలిటీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని పార్టీ బలోపేతం చేసి ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉండాలని అన్ని నూతన జిల్లా మండల కమిటీలకు సూచించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర పార్టీ నిర్మాణ కమిటీ కన్వీనర్ దేశపాక శ్రీనివాస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లె వినయ్ కుమార్ రాష్ట్ర పార్టీ నిర్మాణ కమిటీ కోకన్వీనర్ దారసత్యం రాష్ట్ర మహిళా విభాగం ఆర్ లక్ష్మి చంద్రశేఖర్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
