ఆపదలో ఉన్నవారికి శ్రీరామ రక్ష సీఎంఆర్ఎఫ్: కార్పొరేటర్ హేమలతా సురేష్ రెడ్డి…
130 – సుభాష్ నగర్ డివిజన్ కు చెందిన సత్యవతి రౌత్ (18) తండ్రి జయదేవ్ రౌత్ అనారోగ్యంతో బాధపడుతున్న విషయాన్ని డివిజన్ అధ్యక్షులు పోలే శ్రీకాంత్ ద్వారా తెలుసుకున్న బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ వెంటనే స్పందించి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 1 లక్ష 50 వేల రూపాయలను మంజూరు చేయించగా ఈరోజు చింతల్ లోని ఎమ్మెల్యే కార్యాలయంలో కార్పొరేటర్ జి.హేమలత సురేష్ రెడ్డి చేతులమీదుగా లబ్ధిదారులు సత్యవతి రౌత్ కు ఎల్వోసీ చెక్కును అందజేశారు.
ఈ కార్యక్రమంలో డివిజన్ ప్రధాన కార్యదర్శి శివాజీ, సీనియర్ నాయకులు గుబ్బల లక్ష్మీనారాయణ, దుర్గారావు, ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు.

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
