బడి బయట విద్యార్థులను బడిలో చేర్చాలి -యం ఈ వో
చిలకలూరిపేట పట్టణంలోని ఆర్ వి ఎస్ సి ఎస్ హై స్కూల్ క్లస్టర్ సమావేశంలో చిలకలూరిపేట మండల విద్యాశాఖ అధికారి శ్రీ బి సత్యనారాయణ సింగ్ మాట్లాడుతూ పాఠశాలలో మధ్యలో బడి మానేసిన విద్యార్థిని విద్యార్థులను తిరిగి మరల బడిలో చేర్పించాలని తెలిపారు.
పాఠశాల నిర్వహణలో భాగంగా తరగతి వారీగా మోడల్ లెసన్ చెప్పించడం జరుగుతుంది ఉపాధ్యాయుల అభిప్రాయాలు సేకరించటం బోధనోపకరణాలు వినియోగించడం లో మెళకువలు, కృత్యాధార బోధన, జాదు పితారా మోడల్స్ వినియోగించడం వంటి అంశాలన్నీ ఈ క్లస్టర్ సమావేశంలో క్షుణ్ణంగా నేర్చుకోవాలని GFLN గ్యారంటీడ్ ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసి శిక్షణలో భాగంగా డిసెంబర్ 5 నుంచి జరిగే 100 రోజుల కార్యక్రమంలో ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొని విద్యా సంవత్సరం పూర్తయ్యే నాటికి విద్యార్థులకు మినిమం లెవెల్స్ వచ్చేలా చేసి అత్యుత్తమ పౌరులుగా తీర్చిదిద్దెల కృషి చేయాలని తెలిపారు, FLN మరియు టరల్ శిక్షణ పొందిన రిసోర్స్ పర్సన్ తగు శిక్షణా అంశాలను సూచించడం జరిగింది. ఈ క్లస్టర్ సమావేశంలో శిక్షణ పొందిన అంశాలను పాఠశాల స్థాయిలో అమలు చేయాలని తెలిపారు.క్లస్టర్ రిసోర్స్ పర్సన్స్ షేక్ జమీర్ బాషా.హైస్కూల్ క్లస్టర్ సెక్రటరీ ఉసా సుబ్బారావు క్లస్టర్ పరిధిలోని అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
