మల్లారెడ్డి హాస్పిటల్ క్యాంపస్ లో హైటెన్షన్ వైర్ ల కింద భవన నిర్మాణం

Spread the love

మల్లారెడ్డి హాస్పిటల్ క్యాంపస్ లో హైటెన్షన్ వైర్ ల కింద భవన నిర్మాణం

అధికారం ధనదాహం వెరసి నిర్లక్ష్యం మల్లారెడ్డి హాస్పిటల్
మల్లారెడ్డి హాస్పిటల్స్ అంటే తెలంగాణలో తెలియని వారు ఉండరు మల్లారెడ్డి తెలంగాణ మంత్రిగా ప్రముఖ రాజకీయ నాయకుడిగా అందరికి సూపరిచితమే

పూలు అమ్మిన పాలు అమ్మిన అనే మాటలతో ప్రజల గుండెల్లో ఉన్న నాయకుడు, అయితే మల్లారెడ్డి హాస్పిటల్ క్యాంపస్ లో పలు నిర్మాణాలు జరుగుతున్నాయి అందులో ఒకటి హైటెన్షన్ వైర్ ల కింద నిర్మిస్తున్నారు

అది యేదానికి నిర్మాణం చేపట్టిన దాని వలన అందులో ఏదైనా ప్రమాదం జరిగితే పెద్ద ఎత్తున నష్టం జరుగుతుంది అని అంటున్న నిపుణులు

అధికారులు మాత్రం ఎటువంటి చర్యలు చెప్పటకుండా చోద్యం చూస్తున్నారు

ప్రముఖ రాజకీయనాయకుడు అని మునిసిపల్ అధికారులు, మెడికల్ లైసెన్సింగ్ అథారిటీ వారు ఈ భవనానికి ఎటువంటి అనుమతులు ఇచ్చిన దాని వల్ల ప్రమాదమే, మెడికల్ డిపార్ట్మెంట్ లేదా మునిసిపల్ అధికారులు ఎటువంటి చర్యలు చేపడతారో వేచి చూడాల్సి ఉంది అంటున్న నిపుణులు

అసలు ఇలాంటి వాటికి అనుమతులు ఇచ్చిన అధికారులు హైటెన్షన్ వైర్ ల కింద నివసించగలరా అనునిత్యం ప్రమాదం అంచున ఉండగలరా మరి వాళ్ళు అనుమతులు ఎలా ఇచ్చారు అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది

You cannot copy content of this page

Scroll to Top