కే.సీ.ఆర్. కృషి కారణంగా నే తెలంగాణా రాష్ట్రం సిద్దించింది

Spread the love

కే.సీ.ఆర్. కృషి కారణంగా నే తెలంగాణా రాష్ట్రం సిద్దించింది

దీక్షా దివస్ ను జయప్రదం చేయాలి : పద్మారావు గౌడ్ పిలుపు
సికింద్రాబాద్ : తెలంగాణ రాష్ట్ర సాధనకు కేసీ ఆర్‌ తన ప్రాణాలను లెక్క చేయకుండా చేపట్టిన దీక్ష రోజును దీక్షా దివస్‌గా నిర్వహించే పద్దతిని పాటిస్తున్నామని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనీ సికింద్రాబాద్ శాసనసభ్యులు, మాజీ డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. సితాఫలమండీ లోని ఎం.ఎల్.ఏ. క్యాంపు కార్యాలయంలో సికింద్రాబాద్ నియోజకవర్గ బీ.ఆర్.ఎస్. నేతల సమావేశం జరిగింది.

ఈ సందర్భంగా పద్మారావు గౌడ్ మాట్లాడుతూ కే.సీ.ఆర్. కృషి కారణంగానే తెలంగాణా రాష్ట్రం సాధించుకోగాలిగామని తెలిపారు. శనివారం సికింద్రాబాద్ నుంచి తెలంగాణా భవన్ కు భారీగా కార్యకర్తలు తరలి రావాలని, సితాఫలమండీ నుంచి ఉదయం బయలుదేరాలని సూచించారు. ఈ కార్యక్రమాన్ని వియయవంతం చేసేందుకు కార్పొరేటర్లు, నాయకులు కృషి చేయాలి. సమావేశం లో కార్పొరేటర్లు సామల హేమ, రాసురి సునీత, కంది శైలజ, లింగాని ప్రసన్న లక్ష్మి శ్రీనివాస్, సమన్వయకర్త రాజ సుందర్ తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top