ఏపీ ప్రైవేట్ హాస్పిటల్స్ కాంపౌండర్, నర్సుల అసోసియేషన్ చిలకలూరిపేట డివిజన్ ఆధ్వర్యంలో అనారోగ్యంతో పాటు ఆర్థికంగా ఇబ్బంది బాధపడుతున్న అసోసియేషన్ సభ్యుడు బాబు కి శాసనమండలి సభ్యులు శ్రీ మర్రి రాజశేఖర్ చేతుల మీదుగా ఆర్ధిక సహాయం అందజేత …
ఈ సందర్భంగా మర్రి రాజశేఖర్ మాట్లాడుతూ ప్రకాశం జిల్లా యద్దనపూడి వాస్తవ్యులు గత కొన్ని సంవత్సరాలుగా కాంపౌండర్ గా పనిచేస్తున్నటువంటి పల్లెపోగు యేసుబాబు గుండె జబ్బు తోటి బాధపడుతుంటే ఏపీ ప్రైవేట్ హాస్పిటల్స్ కాంపౌండర్స్ అండ్ నర్సుల అసోసియేషన్ చిలకలూరిపేట వారు చేయూతనందించి అతనికి వైద్య సహాయం చేయించడం జరిగింది. అతనికున్న ఆర్థిక ఇబ్బందులను గుర్తించి అతనికి 43 వేల రూపాయలు నగదు అతనికి అందించడం జరిగింది. ఈ అసోసియేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఈ అసోసియేషన్ లో ఉన్న సభ్యులు ఎవరికైనా ఆరోగ్యపరంగా గాని, ఆర్థికపరంగా గాని సమస్య ఉన్నప్పుడు మీకు అండగా మేమున్నాం అని ఒక భరోసాను కల్పించడానికి వారికి మానసిక ధైర్యం కల్పించడానికి కృషి చేస్తున్నారు అందుకు వారందరిని అభినందిస్తున్నానని అన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు కొండ్రముట్ల నాగేశ్వరరావు , రాష్ట్ర కోశాధికారి అనపర్తి వెంకట్ , మోహన్ రావు , అనపర్తి శ్రీను , షేక్ జిలాని , స్వామి నాయక్ , వెంకటేష్ తదితర సభ్యులు పాల్గొన్నారు.

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
