బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి,కార్మిక నాయకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి , సీఎల్పీ నాయకుడు, మహనీయులు పి జనార్దన్ రెడ్డి 78 వ జయంతి సందర్భంగా కూకట్పల్లి డివిజన్ పరిధిలోని పాపిరెడ్డి నగర్ కాలనీ లో గల వారి విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించిన PAC చైర్మన్ శ్రీ ఆరెకపూడి గాంధీ .
ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ కార్మిక లోక బాంధవుడు స్వర్గీయ పిజేఆర్ భౌతికంగా మనకు దూరమైనా, ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన మహానేత పిజేఆర్ జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పిస్తున్నాను అని PAC చైర్మన్ గాంధీ తెలియచేశారు.
పిజెఆర్ గారు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి,కార్మిక నాయకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి వర్యులు, సీఎల్పీ నాయకుడిగా పనిచేశారని, ఖైరతాబాద్ నియోజకవర్గం నుండి ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి అనునిత్యం ప్రజల కోసం పరితపించే ప్రజా నాయకుడు పిజెఆర్ ని PAC చైర్మన్ గాంధీ తెలియచేసారు. నిత్యం పేద ప్రజల బాగు కోసం పరితపించే గొప్ప నాయకుడు అని దానికి తోడు తన రాజకీయ జీవితం ఎందరికో ఆదర్శంగా నిలిచిందని నిరుపేదలకు కూడు, గూడు ఎంత అవసరమో గుర్తించి కూడు, గూడు కల్పించిన మహనీయుడని PJR సేవలను PAC చైర్మన్ గాంధీ కొనియాడారు.
పిజెఆర్ రాజకీయాలలో కొత్త ఒరవడిని సృష్టించారు అని, పిజెఆర్ జీవితం ఎంతో మందికి ఆదర్శం అని , నేటి యువత ఆయన అడుగుజాడల్లో నడవాలని, ఆయన ఆశయాలను కొనసాగించేలా ప్రతి ఒక్కరు కృషి చేయాలని PAC చైర్మన్ గాంధీ తెలియచేసారు.
ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు ,మహిళలు, కాలనీ వాసులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
