చర్లపల్లి డివిజన్ పరిధిలోని సోనియా గాంధీ నగర్ ఫేస్ 3 లో నిర్వహించిన ముగ్గుల పోటి బహుమతుల ప్రదానం లో పాల్గొన్న ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి .
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ మహిళల్లోని సృజనాత్మకతను వెలికితీసే ఇటువంటి కార్యక్రమాలు సమాజానికి సానుకూల సందేశం ఇస్తాయని పేర్కొన్నారు. సంప్రదాయ కళలకు ప్రోత్సాహం అందిస్తూ మహిళలకు వేదిక కల్పిస్తున్న నిర్వాహకులను ఆయన అభినందించారు.
ఈ రంగోలి పోటీల్లో అనేక మంది మహిళలు ఉత్సాహంగా పాల్గొని రంగురంగుల రంగోలీలతో ఆకట్టుకున్నారు. విజేతలకు నగదు బహుమతులు అందజేశారు.
ఈ కార్యక్రమంలో BRS పార్టీ చర్లపల్లి డివిజన్ అధ్యక్షుడు మహేష్ గౌడ్ సోనియాగాంధీ నగర్ అధ్యక్షులు కొండ సత్యనారాయణ,నాశగోని పరశురాం,పతే రాజరత్నం అధ్యక్షులు నల్లోల కనకయ్య కార్యదర్శి మాదాసు చందు కోశాధికారి చరక వెంకటేష్ ఉప అధ్యక్షులు ఆకుల సంతోష్ సంయుక్త కార్యదర్శి వి లక్ష్మణ్ నాయకులు స్థానిక నాయకులు సపిడి శ్రీనివాస్ రెడ్డి, బొడిగే రాజు గౌడ్,కనకరజ్ గౌడ్, జై కృష్ణ, నర్సింహ,రాఘవ్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, కనకయ్య,వేణుగోపాల్ రెడ్డి, కడియాల బాబు, అనిల్, శ్రీశైలం, ప్రసాద్ రెడ్డి, సంపత్, శేఖర్, బాలాజీ, మహేందర్ రామకృష్ణ మహిళలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
