ఘనంగా దొడ్డ నరసయ్య వర్ధంతి..*కామ్రేడ్ దొడ్డానర్సయ్య నేటి యువతకు ఆదర్శప్రాయుడు…
చిలుకూరు : స్వాతంత్య్ర సమరయోధుడు, మాజీ ఎమ్మెల్యే కామ్రేడ్ దొడ్డా
నర్సయ్య నేటి యువతకు ఆదర్శప్రాయుడని సీపీఐ పార్టీ మండల కార్యదర్శి, సహాయ కార్యదర్శులు మండవ వెంకటేశ్వర్లు, సాహెబ్ అలీలు అన్నారు. చిలుకూరులో దొడ్డా నర్సయ్య వర్ధంతి సందర్బంగా ఆయన విగ్రహాంకు పూల మాల వేసి నివాళ్లు అర్పించారు. అనంతరం సీపీఐ పార్టీ కార్యలయంలో జరిగిన సమావేశంలో వారు మాట్లాడారు. దొడ్డా నర్సయ్య ఆనాడు తెలంగాణసాయుధ పోరాటంలో ఈ ప్రాంతం నుండి ముఖ్య భూమిక పోషించాడని అన్నారు.
అలాగే ఈ ప్రాంతంలో జరిగిన రజాకార్లకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేపట్టి పేద ప్రజలకు అండగా నిలిచిన మహానీయుడు నర్సయ్య అని కొనియాడారు. చిలుకూరులో అష్ఠంద్రమహాసభ నిర్వహించి చిలుకూరు చర్రితను చర్రిత పుటల్లో ఎక్కించి ఘనత నర్సయ్యదే అన్నారు. అలాంటి మహానీయుడుని నేటి తరం కమ్యూనిష్టులు ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర, జిల్లా, మండల నాయకులు దొడ్డా రమేష్, చేపూరి కొండలు, చిలువేరు అంజనేయులు, పిట్లుట్ల కనకయ్య, కట్టేకోల నాగేశ్వరరావు, దొడ్డా నాగేశ్వరరావు, కొడారు శ్రీను, పోలేబోయిన గంగాధర్, పిల్లుట్ల కృష్ణయ్య, కస్తూరి సైదులు, కస్తూరి సత్యం, అనంతుల రాము, చంద్రయ్య, కడారు రాము, సూరిబాబు, జానిపాషా తదితరులు పాల్గొన్నారు.

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
