తెలంగాణ ఆత్మగౌరవ ప్రస్థానం – ఉద్యమకారుల సంక్షేమమే లక్ష్యంగా “సమగ్ర నివేదిక రూపకల్పన”
తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన ఉద్యమకారుల సంక్షేమం పై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు ఏర్పాటు చేసిన తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ కమిటీ ఉద్యమకారుల సంక్షేమానికి రూపొందించిన సమగ్ర నివేదికను కమిటీ ప్రతినిధులు కుత్బుల్లాపూర్ జాగృతి నాయకులు శీలం వీరేందర్ కుమార్, తెలంగాణ జాగృతి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు కప్పాటి పాండురంగారెడ్డి, తెలంగాణ జాగృతి ములుగు జిల్లా అధ్యక్షుడు నంగావత్ రాజేష్ నాయక్, తెలంగాణ జాగృతి రాష్ట్ర కార్యదర్శి బండారు శ్రీనివాస్ గౌడ శ్రీమతి కల్వకుంట్ల కవిత కి సమర్పించారు.
గత పది రోజులుగా ఉద్యమకారులతో మరియు ఉద్యమకారుల సంఘాలతో భేటీ అయిన కమిటీ సభ్యులు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత వారి ఆకాంక్షలు ఎంతవరకు నెరవేరాయి, స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరగని పోరాటం చేసిన ఉద్యమకారుల ప్రస్తుత జీవన స్థితిగతులు మరియు ప్రస్తుత ప్రభుత్వం ప్రకటించిన సంక్షేమ ఫలాలు వారికి ఎంతవరకు అందుతున్నాయి అని అడిగి తెలుసుకుని వాటిపై నివేదికను తయారు చేసి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కి సమర్పించారు. ఈ నివేదిక ఉద్యమకారుల భవిష్యత్తుకు భరోసా కల్పించేలా రూపొందించామని రానున్న రోజుల్లో తెలంగాణ ఆత్మగౌరవ ప్రస్థానాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు, ఉద్యమకారులందరికీ తగిన గుర్తింపు మరియు సంక్షేమం దక్కేలా చూడటమే తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితక్క ప్రధాన లక్ష్యం అని నివేదికను సమర్పించిన సందర్భంగా కుత్బుల్లాపూర్ జాగృతి నాయకులు శీలం వీరేందర్ కుమార్ తెలిపారు.

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
