కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 280వ డివిజన్ జగదిరిగుట్టలోని శ్రీశ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల సందర్భంగా నిర్వహించిన 55వ కళ్యాణ మహోత్సవం సందర్భంలో ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి మరియు ఆయన ధర్మపత్ని హాజరై స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలు ఎల్లప్పుడూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని స్వామి వారిని ప్రార్థించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ నరేందర్ రెడ్డి, ధర్మకర్తలు బుచ్చి రెడ్డి, వేణు గౌడ్, రవీందర్, రాజు, సునీత, శ్రీనివాస్ చారి, డివిజన్ అధ్యక్షులు గణేష్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు రషీద్, కృష్ణ గౌడ్, పిల్లి ఆంజనేయులు, మాధవి రెడ్డి, సంజీవ్ రెడ్డి, సిద్ధనోళ్ల సంజీవ్ రెడ్డి, మైసిగారి శ్రీనివాస్, అరుణ్ రెడ్డి, చంద్రకళ, అనిత రెడ్డి, రజిత, గఫ్ఫార్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
