యండ్లపల్లి విజ్ఞాన్ స్కూల్‌లో భక్తిశ్రద్ధలతో వసంత పంచమి వేడుకలు

Spread the love

యండ్లపల్లి విజ్ఞాన్ స్కూల్‌లో భక్తిశ్రద్ధలతో వసంత పంచమి వేడుకలు

సూర్యపేట జిల్లా ప్రతినిధి: సూర్యాపేట మండల పరిధిలోని యండ్లపల్లి గ్రామంలో గల విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో వసంత పంచమి వేడుకలు అత్యంత భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. బ్రాహ్మణుల వేదమంత్రాల నడుమ విద్యా దేవత సరస్వతీ మాతకు ప్రత్యేక పూజలు చేశారు. పాఠశాల ప్రాంగణమంతా ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోయి, భక్తితో పరవశించింది. విద్యార్థులు పసుపు వస్త్రధారణతో సరస్వతీ మాతకు పూలు అర్పిస్తూ భక్తి గీతాలు ఆలపించారు.

ఈ సందర్భంగా ఉపాధ్యాయులు విద్యలో శుద్ధి, సంస్కారం, క్రమశిక్షణ ఎంత ముఖ్యమో వివరించారు. పిల్లల్లో ఆధ్యాత్మిక విలువలు, నైతికత పెంపొందించడమే లక్ష్యంగా ఇలాంటి కార్యక్రమాలు ఎంతో అవసరమని పాఠశాల యాజమాన్యం తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ కందాల ఎల్లారెడ్డి, ప్రిన్సిపాల్ అనిత, పాఠశాల ఇన్‌చార్జ్ సతీష్, ఉపాధ్యాయులు, విద్యార్థులు వారి తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. విద్యతో పాటు సంస్కారాలు కూడా విద్యార్థులకు అవసరమని చాటిచెప్పే విధంగా పాఠశాలలో ఈ వేడుకలు ఆదర్శంగా నిలిచాయి.

You cannot copy content of this page

Scroll to Top