వసంత పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించిన లిటిల్ లిల్లీ స్కూల్
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ పరిధిలోని జీడిమెట్ల గ్రామంలో లిటిల్ లిల్లీ స్కూల్లో వసంత పంచమి సందర్భంగా శ్రీ సరస్వతీ పూజ, సరస్వతి హోమం మరియు అక్షరాభ్యాస కార్యక్రమాలు స్కూల్ చైర్పర్సన్ మంజుల ప్రకాష్ గారి ఆధ్వర్యంలో నిర్వహించిన సందర్భంగా విద్యార్థులు సంప్రదాయ వస్త్రధారణతో భక్తి గీతాలు, ఆధ్యాత్మిక స్తోత్రాలతో వేడుకలకు ప్రత్యేక శోభను చేకూర్చగా, చిన్నారులను అభినందించి ఉపాధ్యాయులతో కలిసి సరస్వతి మాతను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి విద్యార్థులు విద్యతో పాటు క్రమశిక్షణ, నైతిక విలువలు మరియు సంస్కృతి పట్ల గౌరవాన్ని పెంపొందించడమే లక్ష్యంగా లిటిల్ లిల్లీ విద్యాసంస్థలు కృషి చేస్తున్నాయని తెలియజేసి తదుపరి..
జీడిమెట్ల గ్రామం లో దాత్రిక్ మోడల్ స్కూల్ లో వసంత పంచమి సందర్బంగా నిర్వహించిన సరస్వతి పూజ కార్యక్రమం లో పాల్గొన్న బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహ రెడ్డి.
ఈ కార్యక్రమం లో డివిజన్ అధ్యక్షులు జోగిని రాజు,సతీష్,సతీష్ చక్రవర్తి, ఎశ్వంత్,పాపయ్య దొర,శ్రవణ్ బోస్ తదితరులు పాల్గొన్నారు.

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
