ప్రతిష్టాత్మక ‘ప్రోకామ్ స్లామ్’ మెడల్స్ సాధించిన 8 మంది కానిస్టేబుళ్లు
దేశవ్యాప్తంగా జరిగిన నాలుగు మెట్రోపాలిటన్ నగరాల మారథాన్లను విజయవంతంగా పూర్తి చేసిన సిద్దిపేట పోలీసులు
దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘ప్రోకామ్ స్లామ్’ లో సిద్దిపేట పోలీస్ కమిషనరేట్‌కు చెందిన 8 మంది కానిస్టేబుళ్లు అద్భుత ప్రతిభ కనబరిచి మెడల్స్ సాధించారు. ఈ ఘనత సాధించిన పోలీసు సిబ్బందిని సిద్దిపేట పోలీస్ కమిషనర్ ఎస్ రష్మీ పెరుమాళ్ గారు ప్రత్యేకంగా అభినందించారు.
ఒకే క్యాలెండర్ సంవత్సరం లో దేశంలోని నాలుగు ప్రధాన నగరాల్లో నిర్వహించే ముంబై మారథాన్ 42.195 కి.మీ (ఫుల్ మారథాన్), ఢిల్లీ మారథాన్ 21.09 కి.మీ (హాఫ్ మారథాన్), కోల్‌కతా మారథాన్ 25 కి.మీ, బెంగళూరు మారథాన్ 10 కి.మీ మారథాన్లను నిర్ణీత సమయంలో పూర్తి చేసిన వారికి ఈ ‘ప్రోకామ్ స్లామ్’ గౌరవం దక్కుతుంది. మన కానిస్టేబుళ్లు
- ఎం. రాజీ రెడ్డి ( ఐటీ సెల్)
- ఎ హరికృష్ణ ( ఐటీ సెల్)
- పి రమేష్ ( ఐటీ సెల్)
- జి అశోక్ , సిద్దిపేట ట్రాఫిక్
- ఈ భానుచందర్ , ఎ ఆర్ కానిస్టేబుల్
- కె జగదీష్ , ఎ ఆర్ కానిస్టేబుల్
- కె. రమేష్ , తోగుట పోలీస్ స్టేషన్
- ఎస్ గోపాల్, సిద్దిపేట ట్రాఫిక్.
ఈ సందర్భంగా సిద్దిపేట పోలీస్ కమిషనర్ ఎస్ రష్మీ పెరుమాళ్.., ఐపీఎస్ మాట్లాడుతూ.. “పోలీస్ విధుల్లో ఉంటూ, అత్యంత కఠినమైన ఈ మారథాన్ల కోసం శిక్షణ పొంది, నాలుగు నగరాల్లో పతకాలు సాధించడం గర్వకారణం. ఇది వారి క్రమశిక్షణకు మరియు శారీరక ధృడత్వానికి నిదర్శనం. వీరి విజయం తోటి సిబ్బందికి మరియు యువతకు స్ఫూర్తిదాయకం” అని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ అడ్మిన్ కుశాల్కర్ గారు పాల్గొని విజేతలకు శుభాకాంక్షలు తెలిపారు.

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
