బాల్యవివాహాల రహిత భారతదేశాన్ని నిర్మించాలి……

Spread the love

బాల్యవివాహాల రహిత భారతదేశాన్ని నిర్మించాలి………జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జ్ వి రజని.

వనపర్తి :
బాల్య వివాహాల రహిత భారతదేశాన్ని నిర్మించాలని జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి వి రజని అన్నారు. బాల్య వివాహ ముక్త్ భారత్ లో భాగంగా జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో సంకిరెడ్డిపల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి మాట్లాడుతూ బాల్య వివాహాలకు సహకరించిన ప్రతి ఒక్కరు కూడా శిక్షార్హులు అవుతారని తెలియజేశారు. బాల్యవివాహానికి గురి అయిన బాధితులు మేజర్ అయినా రెండు సంవత్సరాలలోపు జిల్లా ప్రధాన న్యాయస్థానంలో వారి వివాహాన్ని రద్దు చేయమని పిటిషన్ వేసుకోవచ్చని తెలియజేశారు. బాల్య వివాహ ముక్త్ భారత్ లో భాగంగా ప్రతి ఒక్కరు కూడా బాల్యవివాహాలకు వ్యతిరేకంగా ఉండి బాల్య వివాహ రహిత సమాజాన్ని నిర్మూలించాలని తెలియజేశారు. బాల కార్మికుల నిర్మూలన చట్టం, పోక్సో చట్టం, డ్రగ్ అబ్యూస్ మరియు మోటార్ వాహనాల చట్టం గురించి విద్యార్థులకు తెలియజేశారు. మైనర్ విద్యార్థులు వాహనాలు నడపమని ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ రఘు, పాఠశాల ప్రధానోపాధ్యాయు,లు కృష్ణయ్య ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top