రాష్ట్రస్థాయి క్రీడల్లో రాణించాలి……
కోదాడలో షటిల్ కోర్టు ప్రారంభం రాష్ట్ర స్థాయి పోటీలే లక్ష్యం.. రాష్ట్ర ఉపాధ్యక్షులు రావెళ్ల సీతారామయ్య.
మార్చి నెలలో ఖమ్మంలో జరిగే విశ్రాంత ఉద్యోగుల రాష్ట్రస్థాయి క్రీడా పోటీల్లో రాణించి ప్రధమ స్థానంలో నిలవాలని ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు రావెళ్ల సీతారామయ్య అన్నారు. కోదాడ పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల సంఘ భవనం పక్కన ఖాళీగా ఉన్న స్థలంలో రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు సన్నద్ధమయ్యేలా ఏర్పాటుచేసిన షటిల్, టెన్నికాయిట్ కోర్టులను రిబ్బన్ కట్ చేసి ఆయన ప్రారంభించారు. షటిల్, టెన్నీకాయిట్ పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు ఈ కోర్టును సద్వినియోగం చేసుకొని రాష్ట్ర స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కోదాడ యూనిట్ అధ్యక్షులు వేనేపల్లి శ్రీనివాసరావు, జిల్లా అధ్యక్షులు బొల్లు రాంబాబు,రఘు వరప్రసాద్, వీరబాబు, జానయ్య, భ్రమరాంబ, యజ్దాని, బిక్షం, భూపాలరెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, బాలేమియా, తిరుపతమ్మ తదితరులు పాల్గొన్నారు.

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
