టేకుమట్లలో జాల మల్లమ్మ మృతి కుటుంబాన్నీ పరామర్శించిన వట్టె జానయ్య యాదవ్
సూర్యాపేట జిల్లా ప్రతినిధి: సూర్యాపేట మండలం టేకుమట్ల గ్రామానికి చెందిన జాల మల్లమ్మ గారు అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలియగానే తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర కార్యదర్శి, ఉమ్మడి నల్గొండ జిల్లా ఇంచార్జ్ వట్టె జానయ్య యాదవ్ మృతురాలి నివాసానికి చేరుకుని పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మల్లమ్మ కుటుంబ సభ్యులను పరామర్శించి, ఈ దుఃఖ సమయంలో ధైర్యంగా ఉండాలని సూచించారు. మృతురాలి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, పార్టీ తరఫున ఎల్లప్పుడూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆత్మకూరు మండల అధ్యక్షులు బొల్లే సైదులు, జాల సైదులు, బొర్రాజు జానయ్య, కడెం అంజయ్య, జాల శంకర్, మామిడి ఉదయ్, ఏర్పుల రాజు తదితర నాయకులు పాల్గొన్నారు.

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
