TEJA NEWS

తెలంగాణ భవన్‌లో ప్రెస్‌మీట్ నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ..

ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు మహ్మద్ అలీ , శ్రీనివాస్ గౌడ్ , ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, కే పి వివేకానంద్ రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర , మల్కాజిగిరి పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ రాగిడి లక్ష్మారెడ్డి సీనియర్ నాయకులు పాల్గొన్నారు..

ఈ ప్రెస్ మీట్ లో కేటీఆర్ మాట్లాడుతూ..

➢ సాగునీటి రంగంలో కేసీఆర్ ఎంతో గొప్పగా పనిచేశారు. దేశంలో ఎవరూ చేయని విధంగా కాళేశ్వరం కట్టారు.

➢ వాయువేగంతో తెలంగాణలో సాగునీళ్ల ప్రాజెక్ట్ లు కేసీఆర్ నిర్మించిన విషయం మీకు తెలుసు.

➢ కానీ అప్పట్లో మేఘా ఇంజనీరింగ్ సంస్థను ఈస్ట్ ఇండియా కంపెనీ అని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి మాట్లాడారు.

➢ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా కమీషన్ల కోసమే అంటూ రాయలసీమ లిప్ట్ ఇరిగేషన్ గురించి మాట్లాడారు.

➢ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కూడా మేఘా కృష్ణారెడ్డిని పొలిటికల్ మాఫియా అంటూ కామెంట్ చేశారు.

➢ ఏ కంపెనీని ఆంధ్రా కంపెనీ అన్నారో.. ఏ కంపెనీనిని ఈస్ట్ ఇండియా అన్నారో, ఏ కంపెనీ అరాచక కంపెనీ అన్నారో ఆ కంపెనీపై ఎందుకు చర్యలు తీసుకోవటం లేదు.

➢ హైదరాబాద్ కు నీళ్లు తీసుకురావటానికి మేము సుంకిశాల ప్రాజెక్ట్ చేపట్టాం. కానీ ఈ ప్రభుత్వం. మున్సిపల్ మంత్రి కూడా అయిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ప్రాజెక్ట్ ను పట్టించుకోలేదు.

➢ సుంకిశాలలో మేఘా కంపెనీ క్రిమినల్ నెగ్లిజన్స్ కారణంగా రిటైనింగ్ వాల్ కూలిపోయింది.

➢ ఈ విషయాన్ని అసలు బయటకు తెలియకుండా ముఖ్యమంత్రి సహా ప్రభుత్వం దాచి పెట్టింది.

➢ ఎందుకు దాచి పెట్టారో చెప్పాలంటూ నేను గతంలోనే డిమాండ్ చేశాను. ప్రమాదం పై జ్యూడిషీయల్ ఎంక్వయిరీ కోరాను, కంపెనీని బ్లాక్‌లిస్ట్ చేయాలని అడిగాను.

➢ మేడిగడ్డ ఘటనతో కాళేశ్వరంలో లక్ష కోట్లు నీళ్లలో పోశారంటూ ప్రచారం చేసిన ఈ కాంగ్రెస్ వాళ్లు సుంకిశాల ప్రమాదాన్ని మాత్రం దాచి పెట్టారు.

➢ మొత్తం సంఘటనలో నలుగురు అధికారులను సస్పెండ్ చేసి చేతులు దులుపుకున్నారు. అంతేకానీ కంపెనీని బ్లాక్‌లిస్ట్ చేయలేదు.

➢ కాంగ్రెస్ నేత వివేక్ వెలుగు పేపర్ లోనే మేఘా సంస్థను బ్లాక్‌లిస్ట్ లో పెట్టాలని కమిటీ రిపోర్ట్ ఇచ్చినప్పటికీ చర్యలు లేవని రాశారు.

➢ నేటికి చర్యలు ఎందుకు తీసుకోవటం లేదంటూ…సుంకిశాల అయోమయమంటూ కాంగ్రెస్ నేత పత్రికలోనే వార్త వచ్చింది.

➢ ఏ కంపెనీని ఈస్ట్ ఇండియా కంపెనీ అని ముఖ్యమంత్రి అన్నారో అదే కంపెనీ పై ఎందుకు చర్యలు తీసుకోవటం లేదు.

➢మీరు వేసిన విచారణ కమిటీయే మేఘా కంపెనీని బ్లాక్‌లిస్ట్ లో పెట్టాలని రిపోర్ట్ ఇచ్చింది.

➢ కానీ దొంగలు, దొంగలు కలసి ఊళ్లు పంచుకున్నట్లు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మేఘా సంస్థ కు రాష్ట్రంలోని ప్రాజెక్ట్ లను కట్టబెడుతున్నారు.

➢ కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ కోసం రూ. 4350 కోట్ల టెండర్ ను మేఘా సంస్థకు అప్పగించావు. బ్లాక్‌లిస్ట్ లో పెట్టాలని చెప్పిన సంస్థకు ఎందుకు కాంట్రాక్ట్ కట్టబెట్టావు?

➢ సుంకిశాల ప్రాజెక్ట్ విషయంలో మేఘా సంస్థ పై చర్యలు తీసుకొని కాంట్రాక్ట్ రద్దు చేయాలి. కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కూడా పెద్ద కుంభకోణమే. దానిని కూడా రద్దు చేయాలి.

➢ ఎల్ అండ్ టీ, ఎన్సీసీని కాదంటూ టెక్నికల్ బిడ్ లో డిస్ క్వాలిఫై చేశారు. కేవలం మేఘా, పొంగులేటి కి చెందిన రాఘవ సంస్థ కు మొత్తం పనులను రెండు కేకుల మాదిరిగా ముక్కలు ఇచ్చారు.

➢ మేఘా సంస్థతో కుమ్మక్కై డబ్బులు దండుకునే కుట్ర చేస్తున్నావు.

➢ కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ రూ. 4350 కోట్లలో నీ వాటా ఎంత? ఢిల్లీ వాటా ఎంత?

➢ మొన్న స్కిల్ యూనివర్సిటీ కోసం రూ. 200 కోట్ల విరాళాన్ని ప్రాజెక్ట్ లు కట్టబెట్టినందుకే ఇచ్చారా?

➢ కాళేశ్వరం నీళ్లను గండి పేటలో కలిపి మూసీలోకి పంపిస్తారంట. దీనికోసం రూ. 5,500 కోట్లు ఖర్చు చేస్తారంట. ఇది మరొక కుంభకోణం.

➢ కొండ పోచమ్మ సాగర్ నుంచి గోదావరి నీళ్లను హైదరాబాద్ తెచ్చేందుకు మేము రూ. 1100 కోట్లతో ఖర్చుతో అన్ని సిద్ధం చేశాం.

➢ కానీ పెద్ద ఎత్తున కుంభకోణం చేసేందుకే దీన్ని రూ. 5,500 కోట్లకు పెంచారు.

➢ ఈ ప్రాజెక్ట్ ను కూడా ఈస్ట్ ఇండియా కంపెనీ అన్న మేఘా సంస్థకే ఇవ్వటానికి అన్ని ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఈ విషయం నేను ప్రజలకు ముందే చెబుతున్నాను.

➢ ఐఏఎస్ అధికారులు, ఇంజనీర్లు రేవంత్ రెడ్డి చెప్పినట్లు సంతకం పెడితే మేము అధికారంలోకి వచ్చాక విచారణ తప్పదు. వాళ్ల ఉద్యోగాలు ఊడటం ఖాయం.

➢ ఎక్కడ బిడ్ లు చేస్తున్నారో ఆ సంస్థ పేరు కూడా మాకు తెలుసు.

➢ ఆరు గ్యారంటీలకు, హామీలు అమలు చేసేందుకు, ఉద్యోగులకు డీఏ ఇచ్చేందుకు కూడా పైసలు లేవన్నారు.

➢ కానీ మూసీ ప్రాజెక్ట్ కోసం మాత్రం ఆగమేఘాల మీద పనులు చేసే కుట్ర చేస్తున్నారు. దాన్ని కూడా ఈస్ట్ ఇండియా కంపెనీ అయిన మేఘా ఇవ్వటానికి అన్ని సిద్ధం చేసుకున్నారు.

➢ ఇప్పటికే మన వద్ద నుంచి మహారాష్ట్రకు మూటలు పోయాయి. ఢిల్లీకి కూడా ఈ కంపెనీ ద్వారా మూటలు పంపిస్తారు.

➢ రేవంత్ రెడ్డి కి చిత్తశుద్ది ఉంటే వెంటనే ఈస్ట్ ఇండియా కంపెనీ అని నువ్వు అన్న సంస్థ పై చర్యలు తీసుకోవాలి.

➢ ఈ మొత్తం కుంభకోణాలను నేను ముందే ప్రజలకు వివరిస్తున్నా.

➢ ఎందుకు మీరు ఈ దోపిడీలు చేస్తున్నారో మాకు తెలుసు.

➢ రేవంత్ రెడ్డి చెప్పినట్లు చేస్తే అధికారుల ఉద్యోగాలు కూడా రేవంత్ రెడ్డి ఉద్యోగం పోయినట్లు పోతుంది.

➢ కేబినెట్ లో కూర్చున్న మంత్రి పొంగులేటికి సంబంధించిన కంపెనీకి ఈ పనులు ఇస్తారా?

➢ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అనే నిబంధన ఉందన్న విషయమన్న అసలు తెలుసా?

➢ రేవంత్ రెడ్డి సహాయ మంత్రి అయిన బండి సంజయ్ ఎందుకు దీని మీద మాట్లాడటం లేదు.

➢ మోడీ ఇతర రాష్ట్రాల్లో తెలంగాణ గురించి మాట్లాడతాడు. కానీ ఇక్కడ ఎలాంటి చర్యలు ఉండవు.

➢ బావమరదికి అమృత్ టెండర్లు, మేఘా, రాఘవ సంస్థలకు ప్రాజెక్ట్ లను రేవంత్ రెడ్డి పంచుతున్నాడు.

➢ ఈ దేశంలో చట్టాలు ఉన్నాయా? ఇంత బహిరంగంగా దోపిడీ చేస్తుంటే ఈడీ లు విజిలెన్స్ లు ఏం చేస్తున్నాయి?

➢ బీఆర్ఎస్ మీదికి మాత్రమే ఈడీ, విజిలెన్స్ అంటూ వస్తారా?

➢ పొంగులేటి ఇంటిపై ఈడీ దాడులకు సంబంధించి వాళ్లు మాట్లాడరు. వీళ్లు మాట్లాడరు.

➢కోహినూర్ హోటల్ లో అదానీ కాళ్లు మొక్కి ఏం కాకుండా పొంగులేటి బతిమిలాడుకున్నాడు.

➢ అమృత్ టెండర్లను సీఎం తన బావమరిదికి ఇచ్చిన విషయంలో కేంద్ర సంస్థలు ఎందుకు విచారణ జరపటం లేదు. సీవీసీ ఏం చేస్తోంది.

➢ మేఘా సంస్థ చేసిన పనికి దేశమంతా బ్లాక్‌లిస్ట్ లో పెట్టాలి.

➢ పొంగులేటి అరెస్ట్ అవుతాడంటూ అందరి జాతకాలు చెబుతున్నాడు. నువ్వు ఎప్పుడు జైలుకు వెళ్తావో చూసుకో.

➢ నీ కంపెనీకి కనీసం ఆఫీస్ ఆఫ్ బెన్ ఫిట్ అని కూడా పట్టించుకోకుండా ఏ విధంగా పనులు కట్టబెడతారు.

➢ రేవంత్ రెడ్డి, మేఘా కృష్ణారెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు.

➢ అమృత్ టెండర్లను కూడా పొంగులేటి కంపెనీకి ఇచ్చారు. రాఘవ కంపెనీని కూడా గతంలో రేవంత్ రెడ్డి తిట్టాడు. ఇప్పుడు మాత్రం ఆ కంపెనీకి పనులు ఇస్తున్నాడు.

➢ మూసీని కూడా టెండర్లు కాకముందే మేఘాకు ఇవ్వాలని అన్ని ఏర్పాట్లు చేసేశారు.

➢ గోదావరి నీళ్లను హైదరాబాద్ కు తెచ్చేందుకు రూ. 1100 కోట్లతో అయిపోయే దానికి రూ. 5500 కోట్ల భారీ స్కాం చేయబోతున్నారు.

➢ ప్రధాని మోడీ ఎన్నికలప్పుడు మాట్లాడటం కాదు. ఆర్ఆర్ ట్యాక్స్ అంటివి కాదా? ఎందుకు చర్యలు తీసుకోవటం లేదు.

➢ ఇక్కడ నిరాటకంగా ఆర్ఆర్ ట్యాక్స్ తో పాటు బిల్డర్ల నుంచి గజానికి రూ. 100 వసూలు చేస్తున్నారు.

➢ కేంద్రం ఎందుకు పట్టించుకోవటం లేదు. ఇంత అరాచకంగా కుంభకోణాలకు పాల్పడుతుంటే ఏం చేస్తున్నారు.

➢ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో జరిగిన ఈడీ సోదాలపై ఇప్పటి వరకు ఎందుకు బీజేపీ మాట్లాడటం లేదు.

➢ అదానీతో మీ సంబంధాలు ఏ విధంగా బలపడుతున్నాయో మాకు తెలుసు.

➢ మీ కుంభకోణాలను బయటపెడుతున్నందుకు మమ్మల్ని ఇబ్బంది పెట్టే పని చేస్తారు. అయిన సరే ప్రజల కోసం పోరాటం చేస్తూనే ఉంటాం.

➢ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో ఈడీ దాడులపై ఇప్పటి వరకు స్పందించకపోవటం అంటే బీజేపీ, కాంగ్రెస్ మిలాఖత్ అయ్యిందన్నది స్పష్టంగా తెలిసిపోతుంది.

➢ సుంకిశాల ప్రమాదానికి సంబంధించిన కమిటీ రిపోర్ట్ ను బయట పెట్టటంతో ఇప్పుడు ఆ కమిటీ రిపోర్ట్ ను రేవంత్ రెడ్డి తారుమారు చేసిన చేస్తాడు.

➢ వెంటనే ఆ రిపోర్ట్ ను బయటపెట్టాలి. లేదంటే ఆ కమిటీ రిపోర్ట్ ను ఏదో చేస్తారు.

➢ కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు మేఘా ఇంజనీరింగ్ సంస్థకు ఇచ్చేందుకు ప్రయత్నిస్తుంటే అధికారులు ఏం చేస్తున్నారు.

➢ బీజేపోళ్లు నిద్రపోతున్నారా? నిజాయితీ ఉంటే ఎందుకు విచారణ జరపటం లేదు

➢ ఎన్నికల్లో ప్రయోజనం కోసం మేడిగడ్డలో ఓ పర్రెను పట్టుకొని లక్ష కోట్ల కుంభకోణం అన్నారు.

➢ కేసీఆర్ ని బద్నాం చేసేందుకు మేడిగడ్డ పర్రె విషయంలో ఈ అరాచక శక్తులే ఏదో కుట్ర చేశారని నా అనుమానం.

➢ మేడిగడ్డ వద్ద ఇప్పటికీ రిపేర్లు చేయకుండా అది కొట్టుకుపోవాలనే చూస్తున్నారు.

➢ అమృత్ టెండర్ల ముఖ్యమంత్రి బావమరిదికి రూ. 11 వందల కోట్ల పనులను ఎలా ఇస్తారంటూ కేంద్రమంత్రి నేను ఉత్తరం రాస్తే ఇప్పటి వరకు స్పందన లేదు.

➢ గౌతమ్ అదానీ కొడుకుతో నాలుగు గంటల పాటు రేవంత్ రెడ్డి ఇంట్లోనే చర్చలు జరిపారు.

➢ మోడీ కోసం దామగుండం, అదానీకి సిమెంట్ ఫ్యాక్టరీ, మేఘా కృష్ణా రెడ్డికి అన్ని ప్రాజెక్ట్ లు ఇస్తున్నారు.

➢ రాయదుర్గంలో 84 ఎకరాలను కూడా ఆదానీకి అప్పజెప్పే ప్రయత్నం చేస్తున్నారు.

➢ ఎవ్వరు, ఎప్పుడు అరెస్ట్ అవుతారో మంత్రి చెబుతాడా ? వీళ్లు ప్రభుత్వం నడుపుతున్నారా…సర్కస్ నడుపుతున్నారా?

➢ ఈ బీజేపీ, కాంగ్రెస్ నాయకుల బాగోతాలను బట్టలిప్పి ప్రజల ముందు నగ్నంగా నిలబెడతాం.


TEJA NEWS