జగిత్యాల జీవన్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీ సీరియస్
క్రమశిక్షణ చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్న రేవంత్ రెడ్డి
జగిత్యాలలో బీఆర్ఎస్ పార్టీ తరపున గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన ఎమ్మెల్యే సంజయ్ మనుషులకి బీ ఫారం ఇచ్చి, తన అనుచరులకు బీ ఫారం ఇవ్వకుండా మోసం చేశాడని, తన అనుచరులను స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దింపిన జీవన్ రెడ్డి
కాంగ్రెస్ పార్టీ బీ ఫారంపై పోటీ చేస్తున్న అభ్యర్థులను, జీవన్ రెడ్డి లాంటి సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఓడించడం క్రమశిక్షణారాహిత్యంగా భావిస్తున్న అధిష్ఠానం
వర్గపోరు వల్ల ఒకరి అనుచరులను ఇంకొకరు ఓడించడం పార్టీకి నష్టం కలిగిస్తుందని అధిష్ఠానం ఆందోళన
మరోవైపు గద్వాల, మహబూబాబాద్ లాంటి ప్రాంతాల్లో కూడా కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు బయటపడడంతో, రెబల్ అభ్యర్థుల బలం ముందు కాంగ్రెస్ అభ్యర్థులు ఓడిపోతారని పార్టీ సీనియర్ నాయకుల భావన
దీంతో జగిత్యాలతో పాటు వర్గపోరు ఉన్న అన్ని ప్రాంతాల్లో ప్రత్యేక దృష్టి పెట్టాలని ఇన్చార్జి మంత్రులకు ఆదేశాలు ఇచ్చిన రేవంత్ రెడ్డి

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
