పేటలో కార్మిక, ప్రజా సంఘాల ర్యాలీ
లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని డిమాండ్
చిలకలూరిపేట:స్థానిక కార్మిక, కర్షక, ఉద్యోగ మరియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పట్టణంలో నిరసన ప్రదర్శన జరిగింది. పట్టణంలోని ఎన్.ఆర్.టి సెంటర్ నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ, ప్రధాన వీధుల గుండా సాగుతూ కళామందిర్ సెంటర్ వరకు ఉత్సాహంగా కొనసాగింది. వందలాది మంది కార్మికులు, ప్రజా సంఘాల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ డిమాండ్ల సాధనకై నినదించారు. సిఐటియు (CITU), ఎఐటియుసి (AITUC) మరియు ఇతర సంఘాల నాయకులు ప్రసంగించారు. ఈ సందర్భంగా వారు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలపై మండిపడుతూ కార్మికుల హక్కులను హరించేలా ఉన్న కొత్త లేబర్ కోడ్‌లను తక్షణమే రద్దు చేయాలి.పెరిగిన ధరలకు అనుగుణంగా కార్మికుల కనీస వేతనాన్ని రూ. 26,000లకు పెంచాలి.12 గంటల పని విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, దీనిని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. రైతులకు నష్టం చేకూర్చే 2025 విత్తన చట్టాన్ని రద్దు చేయాలని వారు కోరారు.

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
