ఐజ పట్టణ అభివృద్ధి తన లక్ష్యం.
సంపత్ కుమార్.
అలంపూర్ సాక్షిత:
అలంపూర్ తాలూకా ఐజ పట్టణాభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని, సంపత్ కుమార్ అన్నారు.
సంపత్ కుమార్ ని కలిసి సత్కరించిన 16 వ వార్డ్ కౌన్సిలర్ కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు, ఎస్ మద్దిలేటి.
హైదరాబాద్ లోని ఎ ఐ సిసి కార్యదర్శి మాజీ శాసనసభ్యులైన డాక్టర్ సంపత్ కుమార్,
నివాసంలో ఐజ మున్సిపాలిటీ
16వ వార్డ్ కౌన్సిలర్ మద్దిలేటి దంపతులు సంపత్ కుమార్ ని కలిసి మర్యాదపూర్వకంగా శాలువా పూలమాలతో సత్కరించారు. వార్డులో ఉన్న పలు సమస్యలను సంపత్ కుమార్ దృష్టికి తీసుకెళ్లడంతో సత్వరమే అన్ని విధాల ప్రభుత్వం నుండి సహాయ సహకారాలు ఉంటాయని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి మాజీ కౌన్సిలర్ రాజు నారాయణ, బాలరాజు,చిన్న బాబు తదితరులు పాల్గొన్నారు

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
