నేటి బాలలే… రేపటి శాస్త్రవేతలు… కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ .
సైన్స్ ఫెయిర్లు నిర్వహించడం వల్ల విద్యార్థుల్లో శాస్త్ర, సాంకేతిక పరిశోధనల పట్ల చిన్ననాటి నుంచే ఆసక్తి పెరుగుతుందని కార్పొరేటర్ అన్నారు. శేరిలింగంపల్లి డివిజన్… జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన సైన్స్ ఎగ్జిబిషన్ కార్యక్రమానికి శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ముఖ్య అతిథులుగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
అనంతరం స్కౌట్స్ & గైడ్స్ లో శిక్షణ పొందిన విద్యార్థులు కార్పొరేటర్ సమక్షంలో పారేడ్ నిర్వహించారు.
ఈ సందర్బంగా కార్పొరేటర్ మాట్లాడుతూ.. విద్యార్థులు కూడా తమ పరిశోధనల ద్వారా మానవాళి అభివృద్ధికి పాటుపడేలా కష్టపడాలన్నారు. విద్యావకాశాలు, వసతులు ఎలా ఉన్నా.. గొప్ప స్థాయికి ఎదగాలన్నారు.
అత్యంత పేద కుటుంబంలో పుట్టి చాలా కష్టపడి చదువుకుని రోల్ మోడల్ గా ఎదిగి, ఆ తరువాత దేశానికే రాష్ట్రపతి అయిన డాక్టర్ ఏపిజె అబ్దుల్ కలాం మనందరికి స్ఫూర్తిదాయకమన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు సుభాష్ చంద్ర రెడ్డి , శేరిలింగంపల్లి మండల విద్యాధికారి వెంకటయ్య , పి.ఆర్.టి.యు టిఎస్ రంగారెడ్డి జిల్లా శాఖ అధ్యక్షులు సామల మహేందర్ రెడ్డి , పాఠశాల ఉపాధ్యాయులు బలవంత రెడ్డి , ఉదయ్ కుమారి , కరుణ , కేశవరెడ్డి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, విద్యార్థి విద్యార్థునులు తదితరులు పాల్గొన్నారు.

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
