పేదింటి ఆడపడుచులకు అండగా కల్యాణ లక్ష్మి షాదిముబారక్…
ఎమ్మెల్యే చింతకుంట విజయరమణా రావు …
పెద్దపల్లి / జూలపల్లి మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మండలంలోని పలు గ్రామాలకు చెందిన 23 మంది లబ్ధిదారులకు ₹ 23,27,697 /- లక్షల రూపాయలు కల్యాణ లక్ష్మి షాదీముబారక్ చెక్కులను పంపిణి చేసిన పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణా రావు …
ఈ సందర్బంగా ఎమ్మెల్యే విజయరమణా రావు మాట్లాడుతూ…
కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు పేద, మధ్యతరగతి కుటుంబాలకు పెద్ద అండగా నిలుస్తున్నాయని అన్నారు..మహిళల సాధికారతకు ఇవి దోహదపడుతున్నాయని, ప్రజలు ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.
సంక్షేమ పథకాలలో ముందున్నామని ఫ్రీ బస్సు, రైతులకు సన్న వడ్లకు బోనసు, నిరుపేదలకు వైద్యంకు ఎఓసీలు, ఇందిరా ఇండ్లు, రేషన్ కార్డులు, ఇలా అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి ముందుకు పోతున్నామని, రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి పథంలో పయనించేలా కృషి చేస్తానని పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలం అయ్యేవిధంగా పాలన కొనసాగుతుందని రైతులకు పెద్దపీట వేస్తున్నామని పేర్కొన్నారు. ప్రజలందరూ కాంగ్రెస్ పాలనలో సుభిక్షంగా ఉన్నారని పేర్కొన్నారు…
ఈ కార్యక్రమంలో తాసిల్దార్, పలు గ్రామాల సర్పంచ్ లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
