నిజం గెలిచింది.. రాజకీయ కుట్రే”: కవిత వ్యాఖ్యలు

Spread the love

“నిజం గెలిచింది.. రాజకీయ కుట్రే”: కవిత వ్యాఖ్యలు

హైదరాబాద్‌,: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు నుంచి బయటకు వచ్చిన అనంతరం బీఆర్‌ఎస్ నేత కల్వకుంట్ల కవిత భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు. “నిజం గెలిచింది.. కడిగిన ముత్యంలా బయటకు వచ్చాను” అని తెలిపారు.
తనపై పెట్టిన కేసు పూర్తిగా రాజకీయ కుట్రేనని కవిత ఆరోపించారు. బీఆర్‌ఎస్ పార్టీని, ముఖ్యంగా మాజీ సీఎం కే. చంద్రశేఖర్ రావును టార్గెట్ చేయడానికే ఈ కేసు పెట్టారని పేర్కొన్నారు. “మూడేళ్ల పాటు నానా మాటలు అన్నారు.. సోషల్ మీడియాలో ట్రోల్స్ చేశారు. కానీ చివరకు నిజం వెలుగులోకి వచ్చింది” అని అన్నారు.
ఈ సందర్భంగా తన తల్లిదండ్రులు, అత్తామామలు కష్టకాలంలో అండగా నిలిచారని కృతజ్ఞతలు తెలిపారు. “నాకు అండగా నిలిచిన వారిని ఎప్పటికీ మరిచిపోను” అని కవిత స్పష్టం చేశారు.
కేసు పరిణామాల నేపథ్యంలో ఆమె వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి.

You cannot copy content of this page

Scroll to Top