కుత్బుల్లాపూర్ నియోజక వర్గంలోని సూరారం డివిజన్ లో గల కృష్ణానగర్ & భవాని నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వారి సమస్యల పై మాజీ శాసనసభ్యులు కూన శ్రీశైలం గౌడ్ ని మర్యాదపూర్వకంగా కలిశారు….
కుత్బుల్లాపూర్ నియోజక వర్గంలో సూరారం డివిజన్ లో గల కృష్ణానగర్ మరియు భవాని నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు తమ కాలినీలలో అంతర్గత రోడ్లు మరియు డ్రైనేజీ నిర్మాణాలు చేపట్టాలని స్థానిక కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మరియు మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ని కలిసి తమ సమస్యలను వివరించారు…
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వారి యొక్క సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సాధ్యమైనంత తొందరగా రోడ్లు మరియు డ్రైనేజీ నిర్మాణాలను పునరుద్ధరిస్తామని తెలియజేశారు…
అదేవిధంగా నియోజకవర్గానికి చెందిన పలువురు వివిధ శుభకార్యాల సంబంధించిన ఆహ్వాన పత్రికలను నివాసంలో శ్రీశైలం గౌడ్ కి అందజేశారు…
ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు బషీరుద్దీన్, గణేష్ రెడ్డి, నాగరాజు చారి, కలీం మరియు అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు…

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
