ప్రభుత్వ పాఠశాలవిద్యార్థులకు రీడింగ్ పాడ్స్, సర్టిఫికెట్ ఫైల్స్ పంపిణీ చేసిన ఒకటో వార్డు కౌన్సిలర్ చుక్క జయశ్రీ రాజు
…..
వనపర్తి:
వనపర్తి మున్సిపాలిటీ పరిధిలోని ఒకటో వార్డు నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్ చుక్క జయశ్రీ రాజు తాను చదువుకున్న వనపర్తి మండలంలోని చందాపూర్ గ్రామ ప్రభుత్వ పాఠశాలలో ప్రస్తుతం చదువుతున్న పదోవ తరగతి విద్యార్థులకు సర్టిఫికెట్ ఫైల్స్ అలాగే రీడింగ్ ప్యాడ్స్ ను పాఠశాల ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయుల సహకారంతో పంపిణీ చేయడం జరిగింది ముందుగా తమ పాఠశాలలో చదువుకొని కౌన్సిలర్ గా గెలుపొంది మొదటిసారిగా పాఠశాలకు విచ్చేసిన తమ పూర్వ విద్యార్థిని చుక్కజయశ్రీ రాజు దంపతులను పూలమాలలు వేసి సన్మానించారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి చుక్క జయశ్రీ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ తను చదువుకున్న రోజులను నెమరు వేసుకుంటూ విద్యార్థులు కష్టపడి చదువుకొని మంచి ఫలితాలను సాధించి చదువుకున్న పాఠశాలకు చదువు చెప్పిన గురువులకు మంచి పేరు తీసుకురావాలని ఈ సందర్భంగా కోరారు అలాగే మాజీ కౌన్సిలర్ చుక్క రాజు చదువుకున్న ఒకటో వార్డులోని తెలుగువాడా స్కూల్లో ప్రస్తుతం చదువుతున్న పదవ తరగతి విద్యార్థులు మంచి మార్కులు సాధించిన వారికి పంద్రాగస్టు రోజున బహుమతులు ప్రధానం చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా వారు తెలిపారు.

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
