జనగామలో ఉచిత మెడికల్ క్యాంప్ ను ప్రారంభించిన, ఆరవ డివిజన్ కార్పొరేటర్ శ్యామని….
పెద్దపల్లి// రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఆరవ డివిజన్ జనగామ లో ఉన్న అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ నందు ఉచిత మెడికల్ క్యాంపు ను ఆరవ డివిజన్ జనగామ కార్పొరేటర్ ఆవుల తోకల శ్యామనిరమేశ్ ప్రారంభించారు.
జరిగిన ఈ కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన 99 రోజుల ప్రజా-పాలన ప్రగతి-ప్రణాళికలో భాగంగా ఉచిత వైద్య శిబిరాలను నిర్వహించడం జరుగుతుందని, ఈ శిబిరంలో ప్రజలకు సంబంధించిన అనేక అనారోగ్య సమస్య లను పరిశీలించడం కోసం ప్రభుత్వం ప్రత్యేక డాక్టర్ లను పంపించడం శుభ పరిణామం అని, దీని వల్ల ప్రజారోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ఆమె పేర్కొన్నారు.
ఈ క్యాంప్‌లో వివిధ విభాగాలకు చెందిన వైద్య నిపుణులైన గైనకాలజిస్ట్ మహిళల ఆరోగ్య సమస్యల కోసం, పిల్లల వైద్య సేవల కోసం పీడియాట్రిక్, కంటి ఆరోగ్యానికి సంబంధించి ఆప్తమాలజిస్ట్, ఎముకలు, కీళ్ల సమస్యల కోసం ఆర్థోపెడిక్ డాక్టర్, దంత సమస్యల కోసం డెంటిస్ట్ డాక్టర్, సాధారణ ఆరోగ్య సమస్యల కోసం ప్రత్యేక డాక్టర్ లు వచ్చి పేషేంట్లను పరిశీలించి అవసరమైన మెడిసిన్ లను హాస్పిటల్ పారామెడికల్ సిబ్బంది అందజేశారని ఆమె పేర్కొన్నారు. పేద, మధ్యతరగతి ప్రజలకు ఒకే చోట ఇన్ని రకాల స్పెషలిస్ట్ వైద్యులను ఉచిత మెడికల్ క్యాంపు కు పంపడం ద్వారా ప్రజలకు మెరుగైన ఉచిత చికిత్స లభిస్తుందని ఆమె అన్నారు.
ముఖ్యంగా ‘ప్రజా-పాలన’ లక్ష్యంలో భాగంగా ప్రభుత్వం నేరుగా ప్రజల వద్దకు వైద్య సేవలను తీసుకువెళ్లడం అభినందనీయమని ఆమె అన్నారు. ఇంకా ఈ మెడికల్ క్యాంపు లో నిపుణులైన వైద్యులతో పాటు వైద్య సిబ్బంది పాల్గొని సేవలు అందించారు.

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
