రంజాన్ పండుగ సందర్భంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ముస్లిం సోదరులకు తోడ్పాటు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న “ఈద్ కా తోఫా” (రంజాన్ కానుక) పథకం పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈరోజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ప్రగతి నగర్‌లోని మసీద్ వద్ద ఈ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డి హాజరై మసీదుల ద్వారా అర్హులైన ముస్లిం కుటుంబాలకు ఈద్ కా తోఫాలు (దుస్తులు మరియు ఇతర నిత్యావసర వస్తువులు) పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా హన్మంతన్న మాట్లాడుతూ, రంజాన్ పండుగ సోదరభావం, సహనం మరియు సేవా భావానికి ప్రతీక అని అన్నారు. పేద మరియు అవసరమైన కుటుంబాలకు ప్రభుత్వం అందిస్తున్న ఈద్ కా తోఫా పథకం వారికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని తెలిపారు. ముస్లిం సోదరులు రంజాన్ పర్వదినాన్ని ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో సుధీర్ రెడ్డి, మహమ్మద్ నబి , వాసు, మెడ శ్రీను, రమేష్, నారాయణ రెడ్డి, ఆలేటి శ్రీనివాస్, రఫియా బేగం, బికాంషా, సురేందర్ రెడ్డి, అరవింద్, రవీందర్, తులసి దాస్, ఆది రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, మల్లికార్జున్ రెడ్డి, ఏ.వి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
